సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చికెన్ నారాయణగా పేరు తెచ్చుకున్న నారాయణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై తనదైన స్టైల్లో విరుచుకు పడ్డారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా తక్కువ టైంలో ఎన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని సుప్రీం కోర్టు వేసిన ప్రశ్నకు ఏం సమాధానం చెబుతాడు ? సీబీఐ దర్యాప్తులో అనేక వాస్తవాలు బయటకు వస్తున్నాయని, ఇవన్నీ నిరాధారమైనవని చెప్పగలరా? అని ప్రశ్నించారు. మరి నారాయణ వ్యాఖ్యల పై వైయస్సార్పీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
