26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
  • student.gif

    Oct 03 ,2012 04:16 pm

    46 students killed in Nigeria hostel

    నైజీరియాలో ఉన్మాదులు నెత్తుటేరులు పారించారు. ముబీ పట్టణంలోని అడమవా స్టేట్ యూనివర్సిటీ హాస్టళ్లలోకి రాత్రి సైనిక దుస్తుల్లో చొరబడి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 46 మంది మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. దేశ 52వ స్వాతంత్య్ర దినోత్సవాన ఈ దారుణం చోటుచేసుకుంది. దుండగులు హాస్టళ్లలోకి ప్రవేశించిన అనంతరం విద్యార్థులను పేర్లు చెప్పాలని అడిగారని, తర్వాత వారిలో కొంతమందిని వదిలేసి తక్కినవారిపై కాల్పులు జరిపారని ఒక లెక్చరర్ వెల్లడించారు. వారు తుపాకులు, కత్తులతో దాడి చేశారన్నారు. అయితే, ఈ దాడికి ఎవరు పాల్పడ్డారో తెలియరాలేదు. కాగా, ఈ ప్రాంతంలో ‘బొకో హరమ్’ అనే ముస్లిం తీవ్రవాద సంస్థ తరచూ దాడులు చేస్తూ ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. పాశ్చాత్య సంస్కృతిని నిరసిస్తూ ప్రజలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి.. షరియా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంగా ఈ సంస్థ దాడులకు పాల్పడుతోంది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers