
అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి కసాయి తండ్రి కన్న కూతురికే వాతలు పెట్టాడు. నగరంలోని వారాసిగూడకు చెందిన షర్మిల, హేమచందర్ 2000లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సాయినిఖిల్, వర్షిత (3) అనే ఇద్ద రు పిల్లలు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న హేమచందర్.. భార్యను శారీరకంగా హింసించడం ప్రారంభించాడు. దీంతో 2007లో పుట్టింటికి చేరుకున్న షర్మిల మహిళా కమిషన్‌కు భర్తపై ఫిర్యాదు చేసింది. కానీ, 2012 మార్చి లో హేమచందర్ షర్మిల తండ్రి దగ్గరికి వచ్చి.. ఎటువంటి ఇబ్బంది పెట్టనని మా టిచ్చి షర్మిల, పిల్లలను తన ఇంటికి తీసుకెళ్లాడు. తాజాగా అక్టోబరు 1న హేమచందర్ తన కుమార్తె వర్షితను సీతాఫల్‌మండిలో తనతో వివాహేతర సంబంధం ఉన్న మహిళ ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి వర్షిత ఒంటిపై ఇస్త్రీపెట్టెతో వా తలు పెట్టారు. విషయం తెలిసిన షర్మిల.. భర్త హేమచందర్, వివాహేతర సంబం ధం పెట్టుకున్న మహిళపై చిలకలగూడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
