
అహింసాయుధంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహాత్ముని బాటలో ఆయన జయంతి సందర్భంగా ప్రవాస భారతీయ డాక్టర్ నరీందర్ కపూర్ ప్రభుత్వ దమన నీతిని ఖండిస్తూ ఐదు రోజుల సత్యాగ్రహం చేపట్టారు. జాతీయ ప్రజారోగ్య సేవల పథకం (ఎన్‌హెచ్ఎస్) వైఫల్యాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకే అహింసా మూర్తి గాంధీజీ స్ఫూర్తితో దీక్ష ప్రారంభించానని కపూర్ వివరించారు.