19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Pakistan.gif

    Oct 02 ,2012 11:48 am

    Pakistan cuts fuel prices

    వాహన దారులకు శుభవార్త  భారీగా ఇంధన ధరలు తగ్గించారు.  అయితే మన దేశంలో కాదులేండి? మన శత్రువు దేశం అయిన పాకిస్ఠాన్ లో  భారీ ఎత్తున ఇందన రేట్లు తగ్గించారు.  మన దేశంలో  ఇంధన ధరలు  ఆకాశం పైకి చూస్తుంటే. పాక్ మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించింది. ఈ ధరల తగ్గుదల నిన్నటి  నుంచి అమలులోకి వచ్చింది. పెట్రోలుపై లీటరు కు రూ.6 మేరకు, గ్యాస్‌పై (సీఎన్‌జీ) కిలోకు రూ.5, కిరోసిన్‌పై లీటరుకు 40 పైసలు, డీజిల్‌పై లీటరుకు 14 పైసలు చొప్పున తగ్గించినట్లు జియో టీవీ న్యూస్ చానల్ వెల్లడించింది. కొత్త ధరల ప్రకారం పెట్రోలు ధర ప్రస్తుతం లీటరుకు రూ.102.45, డీజిల్ లీటరు రూ.113.16, కిరోసిన్ లీటరు రూ.101.23, లైట్ డీజిల్ రూ.99.22, గ్యాస్ కిలో రూ.5కు చేరుకున్నాయి. భారత కరెన్సీ ప్రకారం చూసుకుంటే పెట్రోలు లీటరు రూ.56.54, డీజిల్ రూ.62.46, కిరోసిన్ రూ. 55.87, లైట్ డీజిల్ రూ.53.11, సీఎన్‌జీ కిలో రూ. 2.76కు చేరుకున్నాయి. కాగా, భారత్‌లో రాజధాని ఢిల్లీలోని ధరల ప్రకారం పెట్రోల్ లీటరు రూ.68.46, డీజిల్ లీటరు రూ.46.95, కిరోసిన్ లీటరు రూ.14.83, సీఎన్‌జీ కిలో రూ.38.35గా ఉన్నాయి.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers