spacer

BV.gif

Posted: 05/05/2012 10:50 AM IST

TDP Yemmiganur Assembly Segment candidate BV Mohan Reddy

సినీనటుడిగా ఉన్న నాటినుంచే ఎన్టీఆర్‌కు జ్యోతిష్యం, సినిమాలకు ముహూర్తం నిర్ణయించిన బివి చివరికి భువనేశ్వరికి చంద్రబాబుతో వివాహ ముహూర్తం నిర్ణయించి దగ్గరుండి పెళ్లి జరిపించారు. కల్లూరు మండలం ఉలిందకొండకు చెందిన మోహన్‌రెడ్డి ఎన్‌టిఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. దివంగత ఎన్‌టిఆర్ నమ్మిన జ్యోతిష్యుడిగా పేరొంది ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బివి మోహనరెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉప ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నరు.

1983లో రాజకీయ జీవితాన్ని ఉప ఎన్నికలతో ప్రారంభించి విజయం సాధించారు. 1999 ఎన్నికల వరకు 16 సంవత్సరాల పాటు ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009 ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి చెన్నకేశవరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2004 వరకు సాఫీగా సాగిన బివి రాజకీయ జీవితం ఆ తరువాత కుంటుపడింది. ఉప ఎన్నికల్లో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు పావులు కదుపుతున్నారు. స్థానికేతరుడన్న ప్రత్యర్థుల ప్రచారం నుంచి తప్పించుకునేందుకు ఎమ్మిగనూరులో కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అంతేగాక భార్య, కుమారుడితో కలిసి ఎమ్మిగనూరులోనే నివాసం ఉంటున్నారు. ఎన్టీఆర్ నమ్మిన జ్యోతిష్యుడిగా పేరుగాంచిన బివి మోహనరెడ్డిని రాజకీయ భవిష్యత్తు గురించి అడిగితే చిరునవ్వు మినహా మరేం మాట్లాడటం లేదు.

 
 
Rate This Article
(0 votes)
Tags : TDP Yemmiganur Assembly Segment candidate BV Mohan Reddy  

Other Articles

 • hindutva-national-projects

  అవసరాన్నిబట్టి హిందుత్వ, జాతీయ విధానాలు

  Jul 13 | ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి హిందుత్వ స్టాంప్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే.  అంతకు ముందు కూడా కాషాయ రాజకీయాలొద్దంటూ భాజపాకి చురకలంటించే ప్రయత్నం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే.  కానీ ఇప్పుడు అదే... Read more

 • common-capital

  రాజధాని ఉమ్మడే కావొచ్చుకానీ పోలీసింగ్ మాదే!

  Jul 13 | హైద్రాబాద్ ఉమ్మడి రాజధానే కావొచ్చు కానీ ఇది మా రాష్ట్రం,  రాష్ట్రంలో పరిరక్షణ మా బాధ్యత అంటోంది తెలంగాణా ప్రభుత్వం.   హైద్రాబాద్, సైబరాబాద్ లలో శాంతి భద్రతలను పరిరక్షించటానికి అవసరమైన పోలీస్ సిబ్బందిని... Read more

 • smoking-discouraged

  థాంక్యూ ఫర్ నాట్ స్మోకింగ్ అంటున్న మోదీ ప్రభుత్వం

  Jul 13 | పొగాకు పంట మీద ఇంతవరకు కాసులు కూడబెట్టిన రైతులకు ఇక దాని మీద ఆశలు వదులుకోవలసిందే.  ఎందుకంటే సిగరెట్ ల మీద సుంకాలను అమాంతం ఆరు రెట్లకు పెంచటం ద్వారా ఒక్కో సిగరెట్ ని... Read more

 • modi-strategy

  వ్యూహాత్మకంగా పగ్గాలు చేపట్టిన మోదీ!

  Jul 13 | ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నది చెప్పటం చాలా కష్టం.  ఏ చిన్న విషయంలోనైనా ఫలితాలు తారుమారయ్యే అవకాశం మెండుగా ఉంటుంది.  కానీ అసలు పరీక్ష గెలిచిన తర్వాతనే ఉంటుంది.  సంపూర్ణమైన మెజారిటీ రాకపోతే మిత్ర పక్షాలను... Read more

 • barat-by-bride

  వరుడి ఇంటికి వెళ్ళిన వధువు బారాత్!

  Jul 12 | భారత దేశంలో ఏ ప్రాంతంలోనైనా పెళ్ళి చేసుకోవటానికి వరుడు వధువు ఇంటికి వెళ్ళటం ఆనవాయితీగా వస్తోంది.   కొన్ని ప్రాంతాలలో అలా తరలి వెళ్ళే వరుడి బృందాన్ని బారాత్ అంటారు.  ప్రాంతాన్నిబట్టి బారాత్ లో గుర్రం... Read more

Today on Telugu Wishesh

 

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers