తెలుగు చిత్రపరిశ్రమలో విలన్ గా కెరీర్ ప్రారంభించిన గోపీచంద్.. ఆ తర్వాత ‘యజ్ఞం’ సినిమాతో హీరోగా గ్రాండ్ ఇచ్చాడు. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో గోపీకి వరుసగా హీరోగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ‘యజ్ఞం’ తర్వాత ఈ హీరో నటించిన సినిమాలు దాదాపు హిట్ అయ్యాయి. అయితే.. ఇతర హీరోలలాగే గోపీచంద్ కీ ఓ సెంటిమెంట్ వుంది. ‘0’ కలిగిన టైటిల్ తో వచ్చిన సినిమాలన్నీ భారీ విజయం సాధించాయి. అందుకు ఉదాహరణగా.. ‘యజ్ఞం’, ‘రణం’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’, ‘లౌక్యం’ చిత్రాలే. మిగతా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటమో, యావరేజ్ గా ఆడటమో జరిగాయి కానీ.. ‘0’ వచ్చినవన్నీ అతని కెరీర్ ని మలుపు తిప్పాయి. అందుకే.. తన తాజా చిత్రం విషయంలోనూ ఈ హీరో అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు సమాచారం.
ఇటీవల ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో ఘనవిజయం సాధించిన దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. గతకొన్నాళ్ల నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి క్రిస్ మస్ కానుకగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రకరకాల టైటిల్స్ ని పరిశీలించిన అనంతరం ‘సౌఖ్యం’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గత సినిమాలతో బేరీజు వేసుకున్నంత అనంతరం ఈ చిత్రానికి ‘సౌఖ్యం’ టైటిల్ గా ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ చిత్రం కూడా గత సినిమాలలాగే ఘనవిజయం సాధిస్తుందని, ఆ విషయాన్ని ఈ చిత్రం కచ్చితంగా రుజువు చేస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. పైగా.. ఈ చిత్రం అన్ని కమర్షియల్ అంశాలతో రూపొందుతోంది కాబట్టి.. దీనిని ఆ టైటిల్ వుంటేనే కథారీత్య సరిపోతుందని యూనిట్ భావిస్తోంది. అయితే.. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన రెజీనా హీరోయిన్గా నటిస్తోంది. ‘జిల్’ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో వున్న గోపీచంద్ ఈ సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందని భావిస్తున్నాడు. అటు.. రెజీనా కూడా ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుందని సన్నిహితవర్గాలు భావిస్తోంది. వరుసగా చిన్న సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న ఈ అమ్మడు.. స్టార్ స్టేటస్ కోసం ప్రయత్నిస్తోందని.. ‘సౌఖ్యం’ సినిమా సక్సెస్ అయితే ఆ స్టేటస్ వస్తుందని ఆశిస్తోందని చెప్పుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more