Telugu Hero Nitin Plans To Release His Courier Boy Kalyan Movie Soon | Akhil Debut Movie

Nitin plans to release courier boy kalyan movie soon

nitin news, nitin reddy, hero nitin, courier boy kalyan, nitin courier boy kalyan, courier boy kalyan movie, nitin reddy latest news, nitin reddy photo shoot, akhil debut movie, trivikram srinivas

Nitin Plans To Release Courier Boy Kalyan Movie Soon : After a long time hero nitin has decided to release his courier boy kalyan movie which is being delayed from the past years.

‘కొరియర్’ సర్వ్ చేయడానికి సిద్ధమవుతున్న నితిన్

Posted: 08/11/2015 02:23 PM IST
Nitin plans to release courier boy kalyan movie soon

చాలాకాలం తర్వాత ‘ఇష్క్’ సినిమాతో వెండితెరపై కనువిందు చేసిన హీరో నితిన్.. ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’, ‘చినదాన నీకోసం’ తదితర సినిమాలతో సందడి చేశాడు. ఈ సినిమాల నేపథ్యంలో ఈ నటుడు ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ అనే సినిమాలోనూ నటించాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యింది కూడా! కానీ.. విడుదలకు మాత్రం నోచుకోలేదు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల విషయంలో జాప్యం పెరుగుతూ వస్తోంది.

ఇంతలోనే నితిన్ నిర్మాతగా ‘అఖిల్’ డెబ్యూ మూవీపై పూర్తిగా దృష్టి సారించాడు. దాంతో తన ‘కొరియర్’ సంగతి కాస్త పక్కన పెట్టాడు. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు నితిన్ సిద్ధమైపోయాడు. వీరి కాంబోలో రూపొందే సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో నితిన్ ‘కొరియర్’ సినిమా విడుదల ఇప్పట్లో వుండకపోవచ్చన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈ వార్తల్ని ఖండిస్తూ నితిన్ ఓ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. తాను నటించిన ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ సినిమాను రంగంలోకి దింపేందుకు నితిన్ ప్రయత్నిస్తున్నాడు.

త్రివిక్రమ్ తో కలిసి తాను తీస్తున్న సినిమా విడుదల అవ్వడానికి చాలా సమయం పడుతుంది. దీంతో తనకి, అభిమానులకు మధ్య గ్యాప్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో తాను ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ సినిమాని రంగంలోకి దింపాలని నిర్ణయించాడు. మరి.. ఈ ‘కొరియర్’ నితిన్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu hero nitin  courier boy kalyan movie  trivikram srinivas  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more