Actor Aadi Pinisetty to play baddie in Allu Arjun's next | boyapati project | Tollywood

Aadi pinisetty to play baddie in allu arjun boyapati project

Aadi Pinisetty news, Aadi Pinisetty nagative role, Aadi Pinisetty updates, Aadi Pinisetty villain role, allu arjun news, allu arjun new movie, allu arjun boyapati srinu, allu arjun next movie, boyapati next movie, allu arjun boyapati movie

Aadi Pinisetty to play baddie in Allu Arjun boyapati project : Actor Aadi Pinisetty, who was last seen in Tamil thriller "Yagavarayinum Naa Kaakka", has been reportedly roped in to play the antagonist in actor Allu Arjun's next yet-untitled Telugu project.

బన్నీతో తలపడనున్న యంగ్ హీరో

Posted: 07/23/2015 12:29 PM IST
Aadi pinisetty to play baddie in allu arjun boyapati project

చిత్రపరిశ్రమలో ఒకప్పుడు విలన్లు హీరోలకంటే పెద్ద వయస్కులుండేవారు. పైగా వారి హంగూ ఆర్భాటాలు, గంభీరం హీరోలకంటే భిన్నంగా వుండేది. అటువంటి వాళ్లు కథానాయకుడితో తలపడేవారు. కానీ.. ప్రస్తుతరోజుల్లో ట్రెండ్ మారిపోయింది. విలన్లు కూడా హీరోల వయస్కులే వుండటం, అందులోనూ హ్యాండ్ సమ్ గా వుంటూ వారిని డామినేట్ చేసే రకంగా వుంటున్నారు. ఈ విధంగా విలన్లు వుండటం వల్ల కుర్రకారులో జోష్ మరింత పెరుగుతుందని... హీరో, విలన్ల మధ్య యాక్షన్ కూడా అదిరిపోయే రేంజులో సమకూర్చవచ్చన్న ఉద్దేశంతో దర్శకనిర్మాతలు ఆ విధంగా సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చెర్రీ సినిమాలో ఓ తమిళ నటుడు విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో యంగ్ హీరో కూడా విలన్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.

అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా రానుందన్న విషయం తెలిసిందే! 26వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీలో బన్నీపై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారట. అంతేకాదు.. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో సాహసాలు కూడా చేయాల్సి వుంటుంది కాబట్టి.. నెగెటివ్ రోల్ కోసం యువనటుడి కోసం మూవీ యూనిట్ అన్వేషించింది. ఈ క్రమంలోనే ‘ఆది పినిశెట్టి’ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు.. బన్నీ సినిమాలో నెగెటివ్ రోల్ కి ఓకే చెప్పేయడం విశేషమని అనుకుంటున్నారు. తెలుగులో అంతగా గుర్తింపులేని ఈ హీరో.. ఈ సినిమాతోనైనా తన ఇమేజ్ ని మరింత పెంచుకోవాలని భావించిన నేపథ్యంలో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వుండొచ్చని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయితే.. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadi Pinisetty  allu arjun  boyapati srinu  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more