వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరొందాడు నటుడు ప్రకాష్ రాజ్. ఏ క్యారెక్టర్ ఆఫర్ వచ్చినా అందులో పూర్తిగా లీనమై, తన నటనాప్రతిభతో ఆ పాత్రకు జీవం పోస్తాడు. ఆయనలో వున్న ఆ టాలెంటే ఆయనకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. అందుకే.. తమ సినిమాల్లో ఏదైనా ప్రత్యేక పాత్ర వుంటే అందుకు ప్రకాశ్ రాజ్ ని ఎక్కువగా సంప్రదిస్తుంటారు దర్శకనిర్మాతలు. అలా ప్రకాశ్ రాజ్ పోషిస్తున్న సరికొత్త పాత్రల్లో ‘రుద్రమదేవి’లోనూ చేశాడు. ఇప్పుడు ఆ పాత్ర గురించే ఇండస్ట్రీలో అంతా చర్చించుకుంటున్నారు.
దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన డ్రీం ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మహామంత్రి ‘శివదేవయ్య’ పాత్రలో నటించాడు. ‘రుద్రమదేవి’లో ఎంతో కీలకమైన ఈ పాత్రకి సంబంధించిన ఆయన గెటప్ ను ఫస్ట్ పోస్టర్ గా దర్శకుడు గుణశేఖర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో విడుదల చేశాడు. ఆ పోస్టర్ లో ప్రకాశ్ రాజ్.. మహామంత్రి హుందాతనాన్ని ప్రదర్శిస్తూ.. అప్పట్లో శివదేవయ్య ఇలానే వుండేవాడా? అన్నట్లుగా కనువిందు చేస్తున్నాడు. ఆ పోస్టర్ ని చూసిన నెటిజన్లు.. డైరెక్టర్ గుణ మహామంత్రి పాత్రకు సరైన నటుడ్ని ఎంచుకున్నారని ప్రకాష్ రాజ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు.. ఆయన ‘గుమ్మడి’ని తలపిస్తున్నాడంటూ చెప్పుకుంటున్నారు.
ఒకప్పుడు మహామంత్రి పాత్ర అంటే అందరికీ నటుడు ‘గుమ్మడి’ గుర్తుకొచ్చేవారు. కానీ.. ఇప్పుడు ప్రకాజ్ రాజ్ గెటప్ చూస్తుంటే గుమ్మడిలానే ప్రకాష్ ఆ పాత్రకి సరిగ్గా సరిపోయాడని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా.. ప్రకాష్ రాజ్ మరోసారి తన నటనాప్రతిభను చాటుకున్నారని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more