‘అతనొక్కడే’ సినిమాతోనే తన డైరెక్టర్ మార్క్ ఏంటో నిరూపించుకున్నాడు సురేందర్ రెడ్డి. ఆ సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన ఈ డైరెక్టర్.. డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు తీస్తూ సరికొత్త రుచిని తెలుగు ప్రేక్షకులకు అందించాడు. మొదట ‘అశోక్’, ‘అతిథి’ వంటి సినిమాలు ఫ్లాప్ అయిన క్రమంలో ఇతని కెరీర్ ఇక ఇండస్ట్రీలో కొనసాగదేమోనన్న అనుమానాన్ని రేకెత్తించింది. అయితే.. దానికి సవాల్ చేస్తూ ఈ దర్శకుడు రవితేజతో కలిసి.. సరికొత్త ‘కిక్’ అందించాడు. ఈ సినిమా టాలీవుడ్ నే మత్తెక్కించేసింది. దీంతో ఈ దర్శకుడికి ‘క్రేజీ డైరెక్టర్’గా పేరొచ్చింది.
‘కిక్’ తర్వాత ‘ఊసరవెల్లి’గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు ఈ డైరెక్టర్ వచ్చాడు కానీ.. ఆ చిత్రం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మళ్లీ ఫ్లాప్ డైరెక్టర్ గా ఇతనికి ముద్రపడింది. దాన్ని ఎలాగైనా చెరిపేసుకోవాలన్న పంథంతో బన్నీతో కలిసి ‘రేసు గుర్రం’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది. అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. ఇంత భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు తన ఆనందభాష్పాలతో సురేందర్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇప్పుడు ఈ డైరెక్టర్ ‘కిక్’కి సీక్వెల్ అయిన ‘కిక్ 2’ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఇక్కడ విశేషం ఏమిటంటే సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమై 10 ఏళ్ళు పూర్తయ్యింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా వచ్చిన ‘అతనొక్కడే’ సినిమా సురేందర్ రెడ్డి డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు తన కెరీర్ ని ప్రారంభించిన నందమూరి ఆర్ట్స్ బ్యానర్ లోనే కిక్ 2 సినిమా చేస్తుండడం, అది కూడా తన జర్నీ పదేళ్ళు కంప్లీట్ చేసుకునే టైంలో మళ్ళీ కళ్యాణ్ రామ్ బ్యానర్ లో చెయ్యడం సురేందర్ రెడ్డికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ పదేళ్ళ జర్నీలో ‘కిక్ 2’తో కలిపి సురేందర్ 7 సినిమాలు చేశాడు.
ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘కిక్ 2’ సినిమా ‘కిక్’ కంటే పెద్ద హిట్ అవుతుందని సురేందర్ రెడ్డి చాలా నమ్మకంగా ఉన్నాడు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ‘కిక్ 2’ సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. ఈ చిత్రం ప్రేక్షకులకు డబుల్ కిక్ ఇస్తుందా..? లేదా..? తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more