sudheer babu mosagallaki mosagadu cencor board report news | Tollywood News

Sudheer babu mosagallaki mosagadu cencor board release new

sudheer babu news, mosagallaki mosagadu movie, actress nandini, sudheer nandini news, sudheer movie news, krishna family members, hero krishna, super krishna news, super star mahesh babu news,

sudheer babu mosagallaki mosagadu cencor board release new : young hero sudheer babu latest movie is ready to release on 22 may. This movie cencor report will come soon.

ఈ ‘మోసగాడి’కి ఏ సర్టిఫికెట్ లభిస్తుందో?

Posted: 05/15/2015 01:15 PM IST
Sudheer babu mosagallaki mosagadu cencor board release new

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన యంగ్ హీరో సుధీర్ బాబు.. ‘ప్రేమకథాచిత్రం’ మొదటి సినిమాతో హిట్ కొట్టాడు. అయితే.. ఆ తర్వాత వచ్చిన ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడిపోయింది. దీంతో ఈయన కూడా ప్రస్తుత యంగ్ హీరోలు ఫాలో అవుతున్న ‘ప్రయోగాత్మక ట్రెండ్’నే పాటించేందుకు సిద్ధమయ్యాడు. యంగ్ హీరోలందరూ కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే! దాంతో వారి సినిమాలు హిట్ అవడంతోపాటు వారికి ఇమేజ్ కూడా పెరుగుతోంది. పైగా.. నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పుడు సుధీర్ కూడా ఇలాగే కొత్త కాన్సెప్ట్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు.

‘స్వామి రారా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత చక్రి చిగురుపాటితో హీరో సుధీర్ బాబు కలిసి ఆ సినిమాకి సీక్వెల్ గా ‘మోసగాళ్లకి మోసగాడు’ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది కూడా! ‘స్వామి రారా’ సినిమాకి సీక్వెల్ మూవీకి కథా పరంగా ఎలాంటి సంబందము ఉండదు. కేవలం విగ్రహాల చోరీ ఒక్క పాయింట్ మాత్రమే కామన్ గా ఉంటుందని సుధీర్ బాబు తెలియజేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని మే 22న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తుంది. ఫైనల్ కాపీని సిద్దం చేసుకున్న ఈ చిత్ర టీం శుక్రవారం సినిమాని సెన్సార్ కి పంపనుంది. వారం రోజుల ముందే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉండాలని చక్రి ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నందిని హీరోయిన్ గా కనిపించనుంది. ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ లో మంచు మనోజ్ గెస్ట్ రోల్ లో కూడా కనిపించనున్నాడు. నెల్లూరు బోస్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా కూడా స్వామి రారాలానే హిట్ అవుతుందని చక్రి చిగురుపాటి అంటున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని హీరో భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాకి ఏ విధమైన సర్టిఫికెట్ లభిస్తుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sudheer babu  mosagallaki mosagadu  mahesh babu  actress nandini  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more