raviteja to do a mass action entertainer film thikkaregindi in santosh srinivas direction

Raviteja mass action entertainer thikkaregindi movie santosh srinivas

raviteja news, mass maharaja news, director santosh srinivas, summer movies, thikkaregindi movie news, producer dvv danaiah, tollywood news

raviteja mass action entertainer thikkaregindi movie santosh srinivas : Maas Maharaja raviteja given green signal for another action entertainer movie which is titled as thikkaregindi. santosh srinivas will direct this movie.

రవితేజ

Posted: 05/11/2015 11:49 AM IST
Raviteja mass action entertainer thikkaregindi movie santosh srinivas

తన కామెడీ ట్రాక్ తోపాటు పక్కా ‘మాస్’ యాక్షన్ తో ‘మాస్ మహారాజా’గా ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు హీరో రవితేజ. ప్రస్తుతం ‘కిక్-2’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాల్లో నటిస్తున్న ఈ హీరో.. అప్పుడే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం! ‘కందిరీగ’, ‘రభస’ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు.

రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగినట్లు మాస్ ఓరియెంటెడ్ కథను సంతోష్ చెప్పడంతో ఈ ప్రాజెక్టుకు రవితేజ పచ్చజెండా ఉపేశాడు. ఈ చిత్రానికి ‘తిక్కరేగింది’ అనే టైటిల్ ని కూడా ఇప్పటికే రిజిష్టర్ చేయించారు. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఇదిలావుండగా.. రవితేజ ‘కిక్-2’ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఇటీవలే జరిగింది. ఈ మూవీని సమ్మర్ కానుకగా ఈనెల చివర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అటు ‘బెంగాల్ టైగర్’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే చిత్రీకరణ ముగించి.. ఈ మూవీని త్వరలోనే విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raviteja  thikkaregindi movie  santosh srinivas  dvv danaiah  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more