Allu Arjun Going summer vacation with family members to enjoy so satyamurthy success

Allu arjun summer vacation family trip boyapati srinu bunny movie updates

allu arjun, allu arjun summer vacation, allu arjun london trip, allu arjun family members, allu arjun boyapati srinu, allu arjun so satyamurthy, allu arjun movies, allu arjun gossips

Allu Arjun summer vacation family trip boyapati srinu bunny movie updates : Allu arjun is going with his family members for summer vacation to london. After this he will join boyapati directorial movie.

లండన్ కు పయనమవుతున్న స్టైలిష్ స్టార్

Posted: 04/28/2015 04:04 PM IST
Allu arjun summer vacation family trip boyapati srinu bunny movie updates

హాట్ హాట్ సమ్మర్ లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’గా ప్రేక్షకులకు ముందుకొచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు జనాలను థియేటర్లలో చల్లదనాన్ని ఆస్వాదించేలా చేశాడు. దీంతో ఫుల్ ఖుషీగా వున్న బన్నీ.. ఇప్పుడు తను కూడా ఈ వేసవిలో చల్లదనాన్ని ఆస్వాదించడం కోసం లండన్ కి వెళుతున్నట్లు సమాచారం! కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్తున్న బన్నీ.. కొన్నాళ్లపాటు అక్కడే హాయిగా కాలాన్ని గడపనున్నాడని తెలిసింది. లండన్ లో ఎంజాయ్ చేసిన తర్వాత నూతనోత్సాహంతో దర్శకుడి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలావుండగా.. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యాన్ని చూపించే అల్లు అర్జున్.. బోయపాటి దర్శకత్వంలో చేయబోయే సినిమాలోనూ ఇదివరకెన్నడూలేని సరికొత్త గెటప్ ను ట్రై చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం! అంతేకాదు.. ఈ చిత్రంకోసం బన్నీ కండలు కూడా పెంచుతున్నాడని తెలిసింది. ఇందుకు సంబంధించి అప్పుడే కసరత్తులు చేస్తున్నాడని అంటున్నారు. ఇక ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో చాలా ఫ్రెష్ గా, కొత్త హెయిర్ స్టైల్ లో కనిపించిన బన్నీ.. తదుపరి చిత్రం కోసం వెరైటీ హెయిర్ స్టైల్ ను ప్రయత్నిస్తున్నాడు.

మరోవైపు.. ఇటీవలే బర్త్ డే సందర్భంగా బన్నీ బోయపాటికి సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం విదితమే! దీంతో ఫుల్ ఎగ్జైట్ మెంట్ లో వున్న ఈ దర్శకుడు.. బన్నీ సినిమాకోసం పవర్ ఫుల్ స్ర్కిప్ట్ తయారుచేస్తున్నాడని అంటున్నారు. అలాగే.. బన్నీని సరికొత్త యాంగిల్ లో చూపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. యాక్షన్ దర్శకుడిగా పేరున్న బోయపాటి.. స్టైలిష్ స్టార్ గా పేరున్న బన్నీ కాంబోలో తెరకెక్కునున్న ఈ మూవీ టాలీవుడ్ లో రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  london summer vacation  boyapati srinu  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more