Sundeep Kishan Denies Rumours Of Huge Movie WIth VV Vinayak and Samantha

Sundeep kishan denies rumours vv vinayak samantha huge movie plan

Sundeep Kishan news, Sundeep Kishan twitter, Sundeep Kishan movies, Sundeep Kishan tiger movie, samantha news, samantha hot photos, samantha hot photo shoot, samantha hot gallery, samantha affairs, samantha love affairs, samantha scandals, vv vinayak, vv vinayak news

Sundeep Kishan Denies Rumours VV Vinayak Samantha Huge Movie Plan : Tollywood Young Hero Sundeep Kishan Finally Denies The Rumours Of Huge Movie Proejct WIth VV Vinayak and Samantha.

‘ఫేక్’ రూమర్లను ఖండించిన సందీప్

Posted: 04/25/2015 04:52 PM IST
Sundeep kishan denies rumours vv vinayak samantha huge movie plan

ప్రస్తుతమున్న యువహీరోల్లో జోరుమీదున్న కథానాయకుడు ఎవరంటే ముందుగా ‘సందీప్ కిషన్’ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే.. ఈ హీరో ఏడాదిలో కనీసం రెండుమూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకోవడంతోపాటు ఫ్యామిలీ, యూత్ ని ఆకర్షించేవిధంగా ఎంటర్టైనింగ్ కథనాలతో ముందుకొస్తున్నాడు. దీంతో ఈ హీరో క్రేజ్ బాగానే పెరిగిపోయింది.

ఇదిలావుండగా.. ఈ హీరో ఇండస్ట్రీలోకి ఎంటరై 5 సంవత్సరాలు పూర్తైనట్లుగా ఇటీవలే వార్తలు వెలువడిన విషయం విదితమే! దీనిని పురస్కరించుకుని సందీప్ ఓ భారీ యాక్షన్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. కమర్షియల్ దర్శకుడు వివి వినాయక్, స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి ఓ భారీ యాక్షన్ చిత్రానికి ఈ యువహీరో ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కెరీర్ లో మరింత వేగం పుంజుకోవడం కోసం సందీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంతా అనుకున్నారు. అయితే.. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తాజాగా సందీప్ వెల్లడించాడు.

కొన్నిరోజుల నుంచి కొనసాగుతున్న భారీ చిత్రం ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఈ యువహీరో తేల్చి చెప్పేశాడు. “నేను వివి వినాయక్ దర్శకత్వంలో సమంతతో కలిసి ఓ సినిమా చేస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి కేవలం తప్పుడు వార్తలు మాత్రమే. అయితే అటువంటి ఆఫర్ వస్తే మాత్రం చాలా సంతోషం” అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఇదిలావుండగా.. సందీప్ నటించిన తాజా చిత్రం ‘టైగర్’ మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sundeep Kishan  vv vinayak  samantha  twitter  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more