Tollywood power star pawan kalyan character in gopala gopala movie

pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan gopala gopala movie, victory venkatesh, sriya saran, venkatesh sriya saran, pawan kalyan venkatesh, suresh parthasani, suresh babu, sarath kumar

tollywood power star pawan kalyan character in gopala gopala movie

పవన్ కల్యాణ్

Posted: 09/19/2014 06:55 PM IST
Tollywood power star pawan kalyan character in gopala gopala movie

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటివరకు తన మాస్ స్టైల్ తోనే ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగించారు. పవన్ నటించిన చిత్రాల్లో ఫ్యామిలీ తరహా సినిమాలు వున్నప్పటికీ.. అందులో ఆయన క్లాస్ కంటే మాస్ స్టైలే ఎక్కువగా కనిపిస్తుంది. అయినా కూడా ప్రేక్షకులు ఆయనలో వున్న ఆ మాస్ క్యారెక్టర్ నే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే పవన్ తాజాగా నటిస్తున్న ‘‘గోపాల గోపాల’’ చిత్రంలో మాత్రం మోడ్రన్ కృష్ణుడిగా సరికొత్త అవతారాన్ని ఎత్తబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ నటించిన ఏ సన్నివేశాల్లోనూ మాస్ ఎలిమెంట్స్ కనిపించవని.. అందులో ఆయన మునుపటికంటే సరికొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నాడని ఆ చిత్రం యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.

వెంకటేష్, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో వెంకీ సరసన శ్రియ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటోంది. ఈ సినిమాలో వెంకటేష్ నాస్తికుడిగా కనిపిస్తుండగా.. చిలిపి కృష్ణుడిగా పవన్ కనువిందు చేయనున్నాడు. ఈ సినిమా కథానుసారం.. భూమి మీద ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న వెంకటేష్ కోసం గోపాలుడి అవతారంలో పవన్ భూమ్మీదకు వస్తాడు. ఇక అక్కడి నుంచి వారిమధ్యే ఈ సినిమా కథ అంతా నడుస్తుంటుంది. సురేష్ పార్థసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు, శరత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  gopala gopala movie  victory venkatesh  sriya saran  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more