romance satisfaction | married couple | husband wife relationship

Romance satisfaction marriage couple

romance satisfaction tips, romance tips, love tips, couple romance tips, romance tips telugu, husband wife relationship, couple romance

romance satisfaction marriage couple : New research and tips about how to have a satisfying romance life in a long term marriage.

కొత్తగా పెళ్లయిన వాళ్లు కొంతమంది

Posted: 07/05/2013 11:23 AM IST
Romance satisfaction marriage couple

కొత్తగా పెళ్లయిన వాళ్లు కొంతమంది తమ భార్యలను సుఖపెట్టలేక పోతున్నారని ఓ సర్వేలో తేలింది. విషయం ఏమిటంటే... మామూలుగా వాళ్లు రతి ప్రక్రియ జరిగేలోపు కొందరిలో వీర్యం కొద్ది మోతాదులో ఔట్‌ అవుతుంటుంది. తీరా యోనిలో రతి జరిపే సమయానికి అంగం మెత్తపడి పోవడం... దాంతో అసంతృప్తిగా ఆ కార్యాన్ని ముగించాల్సి వస్తోందని వాపోతుంటారు. సాధారణంగా సెక్స్‌ పరమైన ఆలోచనలు విపరీతంగా కలిగినపుడు ఒక రకమైన రంగులేని ద్రవం ఊరుతుంది. వాటిని కూపర్స్‌ గ్రంథులని అంటారు. అంగస్తంభనం అనేది రెండురకాలుగా ఉంటుంది. ఒకటి అంగం గట్టిపడకపోవడం అయితే...

రెండో ప్రక్రియలో గట్టిపడిన అంగం ఎక్కువసేపు అలానే ఉండకపోవడం... సాధారణంగా అంగస్తంభనం సమస్య ఉన్నవాళ్లకి హార్మోన్‌ పరీక్షలు, డాప్లర్‌ పరీక్షలు, రిజీస్కాన్‌ వంటి పరీక్షలు జరుపుతుంటారు. ఈ పరీక్షలు చేయించే ముందు స్ర్తీ, పురుషులు ఎవరికైనా కౌన్సెలింగ్‌ అనేది ముఖ్యం. అవకాశం ఉంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కౌన్సిలింగ్‌ చేయించుకోవడం మంచిది. రిజిస్కాన్‌ పరీక్షలు అంగస్తంభనం ఏరకంగా ఉందో కంప్యూటర్‌ ద్వారా తెలుసుకుంటారు. లోపం ఎక్కడుందో తెలుసుకుని... అందుకు తగిన చికిత్స జరిపించి పంపుతారు. అందుకుగాను ఒకటి లేదా రెండు రాత్రుళ్లు అక్కడే పడుకోవాలి. రాత్రి నిద్ర సమయంలో అంగస్తంభన ఏరకంగా ఉందో రిజీస్కాన్‌ ద్వారా తెలుసుకుని దానికి తగిన మందులు ఇస్తారు. అన్నింటికన్నా ముఖ్యం ఐరన్‌, విటమెన్‌ పాళ్లు వున్న మందులు లేక ఆహారపదార్ధాలను తీసుకోవడం ద్వారా ఇటువంటి సమస్యను అధికమించవచ్చు.

తనువే... హరిచందనం...

యోనిలో స్రవాలు అందరు స్ర్తీలలో ఒకేలా ఉండవు. స్ర్తీలలో ఉండే రుతుచక్రాన్ని బట్టి స్రవాల పరిమాణం కూడా మారుతుంటుంది. లూబ్రికేషన్‌ కోసం ఇప్పుడు మార్కెట్లో చాలారకాల ప్రొడక్ట్‌లు వస్తున్నాయి. వాటిలో కొన్ని సువాసనలు వెదజల్లేవి కూడా ఉండటం గమనార్హం. అయితే వీటిలో విపరీతమైన రసాయనాలు ఉపయోగించిన వాటి ప్రభావం వలన కొందరికి అతి సున్నితమైన శరీరభాగం అవడం వలన వాటిపై రాపిడి ఎక్కువై పుళ్లు పడే ప్రమాదం ఉంది. అందుకని రసాయనాలు వాడని వాటర్‌ లూబ్రికేషన్స్‌ ఎన్ని రోజులు వాడినా నష్టం వుండదు. ఆడవారి విషయంలో చిన్న వయసులోనే లూబ్రికేషన్‌ తక్కువగా ఉన్నట్లయితే అటువంటి వారు గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.ఒకవేళ ఏదైనా ఇన్‌ఫెక్షన్‌లాంటిది ఏదైనా ఉండివుంటే సెక్సాలజిస్ట్‌ను కలవాలి. కామోద్రేకం కలగడానికి డైరెక్ట్‌గా రతిప్రక్రియలోకి వెళ్లకుండా ఫోర్‌ప్లే పద్ధతుల ద్వారా... సరసపు సంభాషణల ద్వారా... శృంగార చిత్రాలు చూపించడం ద్వారా ఒకరినొకరు ఉత్తేజితులు కావాలి. దాంతో క్రమంగా లూబ్రికేషన్‌ ఉత్పన్నమవుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి లేనప్పుడు తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌నో... సెక్సాలజిస్ట్‌నో కలవడం అన్ని విధాలా మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(6 votes)
Tags : romance satisfaction tips  husband wife relationship tips  romance tips  

Other Articles

  • Couple should avoid few mistakes during love

    రతిక్రీడ సమయంలో దంపతులు తమకు

    Jul 19 | రతిక్రీడ సమయంలో దంపతులు తమకు తెలియకుడానే కొన్ని తప్పులు చేస్తుంటారు. రతిక్రీడ సమయంలో కొంత మంది సీరియస్‌గా ఉంటారు. అదేదో పని... పూర్తి చేస్తే అయిపోతుందనే పద్ధతిలో వ్యవహరిస్తుంటారు. దీంతో తమ భాగస్వామిని ఆనందింపజేయలమనే... Read more

  • External touch romance tips couple love

    శ్రుంగారం అనేది ఒక మధురానుభూతి.

    Jul 19 | శ్రుంగారం అనేది ఒక మధురానుభూతి. దానికి ఏదో పనిగా భావించి ముగించకూడదు. శ్రుంగారంలో మధురానుభూతులు పొందాలి. రతిక్రీడ జరిపేటప్పుడు బాహ్య స్పర్శలు ముగిసిన తరువాత సంభోగానికి ఉపక్రమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సంభోగంలో పాల్గొనేటప్పుడు... Read more

  • Romance positions problems health diseases couple

    రతిలో ఈ భంగిమల వల్ల నష్టమా ?

    Jul 19 | చాలామంది దంపతులకు ఒక వయస్సు వచ్చిన తర్వాత తాము ఇప్పటివరకు సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సెక్స్ పద్ధతులలో మార్పు కావాలని కోరుకుంటుంటారు. అంటే కొత్త పద్ధతులు, భంగిమల్లో దాంపత్య జీవితాన్ని అనుభవించాలని ఉబలాటపడుతుంటారు. వయస్సు... Read more

  • Pre marital romance acts newly married couple love tips

    అనేక మంది జంటలకు నిశ్చితార్థమైనప్పటికీ

    Jul 05 | అనేక మంది జంటలకు నిశ్చితార్థమైనప్పటికీ.. వారు ఏకాంతంగా కలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారు పెళ్లికి ముందే తమకు కాబోయే దంపతులు సుఖాలను పంచుకునే అవకాశం ఉందని, దానివల్ల నష్టమేమీ లేదని నిపుణులు అంటున్నారు.... Read more

  • Romance tips for newly married couples

    కొత్తగా పెళ్లయిన జంటల్లో శృంగార సుఖాన్ని..

    Jul 05 | కొత్తగా పెళ్లయిన నూతన జంటల్లో సెక్సు సుఖాన్ని అనుభవించాలని తహతహలాడుతు ఉన్నప్పటికీ భాగస్వామి అలవాట్లు మూలంగా ఆ సుఖాన్ని సంతృప్తికరంగా అనుభవించలేకపోతారు. మనసు విప్పి చెపితే ఆయన ఏమనుకుంటారోనన్న సందేహం పట్టుకుని పీడిస్తుంది. కనుక... Read more