పెళ్లి.. స్త్రీ, పురుషుల జీవితానికి పరిపూర్ణత చేకూర్చే అపురూపమైన బంధం. కలకాలం ఒకరికొరు తోడుగా వుంటూ సంతోషంగా జీవించేందుకు అదొక సర్టిఫికెట్ లాంటిది. అంతేకాదు.. ఇద్దరి జీవితాలు సుఖమయంగా కొనసాగడానికి ఈ పెళ్లి ఓ ఐడి కార్డ్ లాంటిది. అయితే.. ప్రస్తుత బిజీ ప్రపంచంలో దంపతులు మునిగిపోవడంతో ఆ కార్డుకు అంతగా గుర్తింపు లేకపోయింది. వారు తమ దాంపత్య జీవితాన్ని సుఖంగా సాగించలేకపోతున్నారు. అంటే.. శృంగార రుచిని మరగలేకపోతున్నారు. ఇలాంటివారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. శృంగారంలో భావప్రాప్తి పొందాలంటే.. సెక్సాలజిస్టులు కొన్ని చిట్కాలు ఇస్తున్నారు. అవేంటంటే..
* స్నేహాన్ని మించిన బంధం ఈ ప్రపంచంలో మరొకటి లేదని అందరూ భావిస్తారు. భాగస్వామితోనూ అటువంటి స్నేహబంధాన్నే ఏర్పరుచుకోవాలి. నిత్యం తోడుగా నేనున్నాను అన్న భావన భాగస్వామిలో కలిగించాలి. అప్పుడే.. ఇద్దరి మధ్య వుండే విభేదాలు పూర్తిగా తొలిగి.. అన్యోన్యంగా తమ జీవితాన్ని కొనసాగించవచ్చు. అలాగే.. శృంగార కార్యకలాపాలు ప్రతిరోజూ కొనసాగిస్తే.. వారి బంధం మరింతగా బలపడుతుంది.
* భాగస్వామితో ప్రతి విషయాన్ని చర్చించుకోవాలి. ఏ అంశాలను దాచుకోకుండా ఇరువురు మనసు విప్పి పంచుకోవాలి. అలాకాకుండా ఏవైనా దాచుకుంటే మాత్రం.. అవి ఇరువురి మధ్య అనుమానాలకు, మన:స్పర్థలకు దారి తీసే ప్రమాదం వుంది. తద్వారా ఈ వ్యవహారం విడాకుల దాకా వెళ్లొచ్చు. కాబట్టి.. మనసులో ఏ విషయం దాచుకోకుండా తెరిచిన పుస్తకంలా భాగస్వామితో పంచుకుంటే.. ఇద్దరి జీవితం సాఫీగా సాగుతుంది.
* దంపతుల మధ్య ఏకాధిపత్యం వుండకూడదు. ఇద్దరూ సమానంగా వుంటూ తమతమ మనస్తత్వాలను వ్యక్తపరుచుకుని, అందుకు అనుగుణంగా ఇద్దరూ నడుచుకోవాలి. అలాకాకుండా భాగస్వామి ఎంపికలను తప్పుపడితే.. ఇద్దరి మధ్యా విభేదాలు పెరిగి.. తమ దాంపత్య జీవితాన్ని చేజేతులా పాడుచేసుకున్నవారు అవుతారు. కాబట్టి.. ఇద్దరూ ఏకతాటిపైనే వుంటూ.. తమతమ భావనలను వ్యక్తపరుచుకోవాలి.
* ప్రేమ.. ఇరువురిని చైతన్యపరిచే శ్రేయోభిలాషి. భాగస్వామితో ఈ విధంగా ప్రేమ చిగురిస్తే.. వారు కూడా అదేవిధంగా తమ ప్రేమను చూపుతారు. తద్వారా ఇద్దరూ తమ దాంపత్య సుఖాన్ని పొందవచ్చు. పడకగదిలో కూడా తమకిష్టమైన భంగిమల్లో పాల్గొంటూ శృంగారకార్యాన్ని కొనసాగిస్తే.. భాగస్వామి భావప్రాప్తి పొందడంతోపాటు భర్తలను పూర్తి ఆనందింపజేస్తారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more