PM Modi Meets World Champion PV Sindhu పీవీ సింధూను అభినందించిన ప్రధాని మోడీ

Pm narendra modi meets pv sindhu after her historic triumph

PV Sindhu, PV sindhu gold, PV sindhu beats Nozomi Okuhara, PM Narendra Modi, PV sindhu historic gold, PV sindu creates history, bwf world championships, badminton world championships, sindhu world championships, World Championships, PV Sindhu, BWF World Championships 2019, pv sindhu mother, sports news, badminton news, sports, badminton

India Prime Minister Modi met PV Sindhu, who scripted history by becoming the first Indian world champion in badminton. After meeting Sindhu, PM Modi tweeted, "India’s pride, a champion who has brought home a Gold and lots of glory!"

ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధూను అభినందించిన ప్రధాని మోడీ

Posted: 08/27/2019 08:44 PM IST
Pm narendra modi meets pv sindhu after her historic triumph

వరల్డ్ ఛాంపియన్ ‌‌షిప్ లో విజయకేతనం ఎగురవేసి.. స్వర్ణ పతకాన్ని అందుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్రపుటల్లోకి ఎక్కిన స్టార్ షెట్లర్ పీవీ సింధు.. స్వదేశానికి తిరిగి వస్తూ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని, అంతకుముందు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచిన  తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమె తన ఆనందాన్ని ప్రధాని మోదీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పీవీ సింధుని ప్రధాని మోదీ అభినందించారు.

నాలుగు పర్యాయాలు కాంస్యం, రజతంతో సరిపెట్టుకుని ఐదో పర్యాయం స్వర్ణం సాధించి భరతజాతి ఖ్యాతిని ఇనుపడింపజేసిన సింధూను ప్రధాని ప్రశంసించారు. కాగా, తాను గెలిచిన బంగారు పతకాన్ని సింధు... మోదీ చేతులకు అందజేసింది. దానిని స్వయంగా మోదీ... సింధు మెడలో వేశారు. ఆమె ప్రధానిని కలిసిన సమయంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, సీనియర్ కోచ్ గోపీచంద్, సింధు కోచ్ కిమ్ జి హ్యూన్ కూడా ఉన్నారు.  కాగా ఈ సందర్భంగా పీవీ సింధుకి కేంద్ర క్రీడా శాఖ రూ.10లక్షల నజరానా ప్రకటించింది.

క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు... ఈ చెక్కును సింధు చేతికి అందజేశారు. స్విట్జర్లాండ్ లోని బోసెల్ లో ఆదివారం జరిగిన ఫైనల్ వార్ లో సింధు విజయం సాధించిన సంగతి తెలిసిందే. పదునైన స్మాష్ లు, డ్రాప్ షాట్లతో విరుచుకుపడుతూ తన ప్రత్యర్థి ఒకురను ఉక్కిరిబిక్కిరి చేసింది. దాదాపు 38 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్ లో సింధు వరస గేమల్లో 21-7, 21-7 తో విజయభేరి మోగించింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో సింధు ఇప్పటి వరకు ఐదు పతకాలు గెలుచుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : world championships 2019  PV Sindhu  Gold Medal  PM MODI  Kiren Rijiju  sports  badminton  

Other Articles