my rocket silenced all those who questioned me: PV Sindhu ప్రశ్నించిన వారికి నా రాకెట్ బదులిచ్చింది: సింధు

My rocket silenced all those who questioned me pv sindhu

pv sindhu, answer for questioned, sindhu answer with rocket, sindhu, bwf world championships, badminton world championships, sindhu world championships, World Championships, PV Sindhu, BWF World Championships 2019, pv sindhu mother, sports news, badminton news, sports, badminton

PV Sindhu says she felt "angry and sad" after being criticised for not finishing on top in the last two World Championship finals and the gold medal in the just-concluded edition is her answer to all the critics who questioned her.

ప్రశ్నించిన వారికి నా రాకెట్ బదులిచ్చింది: సింధు

Posted: 08/26/2019 07:46 PM IST
My rocket silenced all those who questioned me pv sindhu

‘పీవీ సింధు నువ్వు వరల్డ్ ఛాంపియన్ ‌‌షిప్ లో ఎందుకు స్వర్ణం గెలవలేకపోతున్నావు..?’ రెండేళ్ల నుంచి భారత అగ్రశ్రేణి షట్లర్ ‌కి తరచూ ఎదురవుతున్న ప్రశ్న ఇదే. కానీ.. తాజాగా ఆ ప్రశ్నకి తన రాకెట్‌ పసిడి పతకంతో సమాధానం చెప్పిందని పీవీ సింధు వెల్లడించింది. 2017, 2018లో వరుసగా వరల్డ్ ఛాంపియన్ ‌షిప్‌ ఫైనల్ కి చేరిన పీవీ సింధు.. రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో.. అమెకు ఫైనల్ ఫోబియా ఉందంటూ ప్రచారం కూడా జరిగింది. ఇక ఎవరు చూసినా ఫైనల్ లో ఎందుకు తడబడుతున్నావన్న ప్రశ్నలనే సంధిస్తున్నారు.

అయితే సింధూ మాత్రం.. వారి ప్రశ్నలకు బదులివ్వాలని బలంగా అనుకుంది. పట్టుదలతో ఛాంపియన్ షిఫ్ లో అడుగుపెట్టిన సింధూ.. వరుసగా మూడోసారి ఫైనల్ వరకు చేరకుంది.  హ్యాట్రిక్ ఫైనల్ లోకి చేరుకున్న ఆమె.. ఈ సారి ఎలాంటి తడబాటు లేకుండా.. స్వర్ణపతక సాధనే లక్ష్యంగా బరిలోకి అడుగుపెట్టింది. జపాన్ షట్లర్ ఒకుహరాపై గెలిచి ఎట్టకేలకి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌ టోర్నీ చరిత్రలో ఓ భారత షట్లర్ బంగారు పతకం గెలవడం ఇదే తొలిసారి.

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అధికారిక వెబ్ సైట్ ‌తో పీవీ సింధు మాట్లాడుతూ ‘గత రెండేళ్లుగా పసిడి పతకం గురించి నన్ను ప్రశ్నించిన వారికి ఇదే సమాధానం. నా రాకెట్‌తో విజయం సాధించి వారికి సమాధానం చెప్పాలని ఆశించా. ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది. గత రెండు పర్యాయాలు ఫైనల్లో ఓడిపోవడం చాలా బాధ, కోపం తెప్పించాయి. అందుకే.. తాజా ఫైనల్లో అన్ని భావోద్వేగాల నడుమ పోటీపడ్డాను. చాలా మంది.. ఎందుకు ఆ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోతున్నావ్..? అని ప్రశ్నించారు. దీంతో.. ఫైనల్‌కి ముందు నా గేమ్.. నేను ఆడాలని గట్టిగా నిర్ణయించుకున్నా.. అలానే ఆడాను.. గెలిచాను’ అని వెల్లడించింది.

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కి ఇప్పటి వరకూ 10 పతకాలు లభించగా.. ఇందులో పీవీ సింధు మాత్రమే ఐదు పతకాలు గెలిచింది. 2013లో కాంస్యం పతకం గెలిచిన సింధు.. 2014లో మరోసారి కాంస్యానికే పరిమితమైంది. ఆ తర్వాత 2017, 2018లో వరుసగా రజతాలను గెలిచినా.. కొద్దిలో స్వర్ణాలను చేజార్చుకుంది. ఇక ఈ సారి అన్ని భావోద్వేగాల నడుమ పోటీపడ్డానని చెప్పిన సింధూ.. స్వర్ణ పతకాన్ని అందుకుని.. ఈ పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా కూడా చరిత్రపుటల్లోకి ఎక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles