Swimmer dies in road mishap అంతర్జాతీయ స్విమ్మర్ ఎంబీ బాలకృష్ణన్ దుర్మరణం.!

Chennai former interational swimming champ dies in accident

Swimmer, South Asian Games, Poonamallee High Road, M B Balakrishnan, international swimmer, former interational swimming champ, M B Balakrishnan dies in accident, M B Balakrishnan died in road mishap, sports news, sports, latest sports news

A truck ran over former international swimmer M B Balakrishnan on Poonamallee High Road, killing him on the spot.

అంతర్జాతీయ స్విమ్మర్ ఎంబీ బాలకృష్ణన్ దుర్మరణం.!

Posted: 05/16/2019 02:52 PM IST
Chennai former interational swimming champ dies in accident

భారత దిగ్గజ స్విమ్మర్, పలు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన ఎంబీ బాలకృష్ణన్, చెన్నై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తన బైక్ పై ఇంటికి వెళుతూ అదుపుతప్పిన ఆయన, ఓ లారీని ఢీకొనగా, లారీ చక్రాలు అతనిపై నుంచి వెళ్లాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన తన స్నేహితుడితో కలసి బంధువుల ఇంటి నుంచి తన ఇంటికి చేరకుంటున్న క్రమంలో ముందువెళ్తున్న కాంక్ట్రీట్ మిక్స్ లారీని ఓవర్ టేక్ చేయబోయాడు. చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్‌ కాలేజిలో చదివిన బాలకృష్ణన్, ఆపై అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడ్డారు.

ఈ క్రమంలో తన బైక్ హ్యాండిల్ లారీకి తగలడంతో ఆయన కుడి వైపుకు పడ్డారు. దీంతో లారీ వెనుకబాగంలోని టైర్లు ఆయనపై నుంచి వెళ్లాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కిల్ పైక్ అసుపత్రికి పోలీసులు తరలించారు. అరుమ్ బక్కమ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు డ్రైవర్ సుబ్రహ్మణ్యన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మృతి పట్ల బాలకృష్ణన్ కోచ్ చంద్రశేఖరన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఇటీవల జరిగిన దక్షిణాసియా క్రీడల్లో స్విమ్మింగ్ పోటీలలో పతకం సాధించారు. కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణన్ ఇండియాకు వచ్చారు. 2007లో గువహటిలో జరిగిన జాతీయ స్విమ్మింగ్‌ లో స్వర్ణ పతకం సాధించడంతో పాటు, 2010 సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌ షిప్‌ లో 50మీ. బ్యాక్‌ స్ట్రోక్‌ విభాగాలో జాతీయ రికార్డును బాలకృష్ణన్ నెలకొల్పారు. దక్షిణాసియా క్రీడల్లో 100మీ., 200మీ. బ్యాక్‌ స్ట్రోక్‌ విభాగాల్లో గోల్డ్ మెడల్ సంపాదించారు. ఏడాది క్రితం ఓ గ్యాంగ్ అతనిపై దాడి చేయడంతో బాలకృష్ణన్ స్విమ్మింగ్ పోటీల నుంచి తప్పుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : M B Balakrishnan  International swimmer  road accident  swimming champ  sports  

Other Articles