Swapna Barman gets a concrete road పసిడే కాదు.. ప్రగతిపథంలో గ్రామాన్ని నిలుపుతుంది..

Swapna barman gets a concrete road to her jalpaiguri home

Swapna Barman, social media, Asian Games 2018, Gold Medal, Ghospara, Jalpaiguri town, North Bengal, sports

Swapna Barman chose a road less travelled where she clinched a historic gold medal in heptathlon - one of the toughest events, at the Asian Games 2018.

పసిడే కాదు.. ప్రగతిపథంలో గ్రామాన్ని నిలుపుతుంది..

Posted: 09/05/2018 06:22 PM IST
Swapna barman gets a concrete road to her jalpaiguri home

ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ లో స్వర్ణం సాధించి తొలి భారత అథ్లెట్ గారికార్డు సృష్టించిన స్వప్న బర్మన్‌ తన గెలుపుతో తన గ్రామానికి కూడా మంచి చేసింది. దవడ నొప్పితో భాధపడుతూ కూడా తన లక్ష్యాన్ని చేరుకోవాలన్న కాంక్షతో స్టిక్కర్‌ వేసుకొని మరీ ఆడిన తన పసిడి స్వప్నాన్ని నిజం చేసుకుంది. ఆసియాడ్‌ క్రీడలను ముగించుకుని వచ్చిన స్వప్నకు ఆ ఊరి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇది సరే అమె తన గ్రామానికి ఎలా ఉపకారం చేసింది అంటారా.?

అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్న మాదిరిగానే తన గ్రామానికి కూడా కనీసం సరైన రోడ్డు కూడా లేదు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కూడా అరకొరే. అయితే, స్వర్ణం గెలిచిన సందర్భంగా స్వప్నను పలకరించడానికి వచ్చే వీఐపీలందరూ స్వప్న ఇంటి ముందు రోడ్డు పరిస్థితి చూసి చలించిపోయారు. ఈమెంత పేదరికం అనుభవిస్తుందో గ్రహించారు. దీంతో ఆమె ఊరికి వెంటనే కాంక్రీటు రోడ్డును మంజూరు చేశారు. పశ్చిమ బంగలోని జల్ పాయ్ గురి పట్టణానికి శివారులో ఉన్న ఘోస్పారా స్వప్న సొంత ఊరు.

ఇక్కడ నివసించే వాళ్లందరూ టీ గార్డెన్స్ లో పనిచేసేవాళ్లే. ఈ ఊరి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. అయితే, స్వప్న స్వర్ణం గెలిచిన తర్వాత ఆ ఊరి రూపు రేఖల్లో మార్పు వస్తోంది. స్వప్న కోసం వచ్చిన ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆ ఊరిని బాగు చేస్తామని ఆమెకు మాటిచ్చారు. దీంతో తొలుత కాంక్రీటు నిర్మాణానికి పూనుకున్నారు. అనంతరం ఆ ఊరికి తాగునీటి సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి అధికారులు చొరవ చూపుతున్నారు. పసిడే కాదు తమ గ్రామస్వరూపాన్ని కూడా స్వప్న మారుస్తుదని గ్రామస్థులు అమెను కొనియాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swapna Barman  social media  Asian Games 2018  Gold Medal  Ghospara  Jalpaiguri town  North Bengal  sports  

Other Articles