Dipika, Joshna win bronze in squash భారత్ ఖాతాలో మరో రెండు కాంస్యాలు..

Asian games dipika joshna win bronze in women s singles squash

Squash, Nicol David, Jakarta, Dipika Pallikal Karthik, Dipika Pallikal, Joshna Chinappa, Saurav Ghosal, Asian Games, sports

India's Dipika Pallikal Karthik on Saturday settled for a bronze in squash women's singles after losing to defending champion Nicol David of Malaysia in the semifinals of the 18th Asian Games here.

ఏషియన్ గేమ్స్: స్క్వాష్‌లో భారత్ కు రెండూ కాంస్యాలే దక్కాయి

Posted: 08/25/2018 05:34 PM IST
Asian games dipika joshna win bronze in women s singles squash

ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌ స్క్వాష్‌లో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. భారత స్క్వాష్ క్వీన్స్ దీపిక పల్లికల్ , జోష్న చిన్నప్ప ఏషియాడ్‌‌లో కాంస్య పతకాలతోనే సరిపెట్టుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన దీపిక,జోష్న మహిళల సింగిల్స్ విభాగాల్లో బ్రాంజ్ మెడల్‌కే పరిమితమయ్యారు. మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్‌లో స్వర్ణం సాధిస్తుందనుకున్న దీపిక పల్లికల్ స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో  విఫలమవ్వగా...రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో జోష్న పోరాడి ఓడింది.

తొలి సెమీస్‌లో మలేసియా  క్రీడాకారిణి నికోల్ యాన్ డేవిడ్‌..దీపికాపై పూర్తిస్థాయిలో  ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా మూడు గేమ్స్‌లోనే భారత స్టార్‌ను చిత్తు చేసింది. ఏకపక్షంగా ముగిసిన పోరులో స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో విఫలమైన దీపిక 0-3తో ఓడి బ్రాంజ్ మెడల్‌ మాత్రమే దక్కించుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన నికోల్ యాన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మరో సెమీఫైనల్‌లో జోష్న చిన్నప్ప ఫైనల్ బెర్త్ కోసం పోరాడింది.

ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన పోరులో మలేసియా  క్రీడాకారిణి శివసంగారి సుబ్రహ్మణ్యం జోష్నపై,పై చేయి సాధించింది. 3-1తో  జోష్నను ఓడించి ఫైనల్ చేరింది.ఉమెన్స్ స్క్వాష్ సింగిల్స్‌ సెమీస్‌లో హాట్‌ఫేవరెట్స్‌గా బరిలోకి దిగిన దీపిక,జోష్నలకు చెక్ పెట్టిన ఘనత మలేసియన్ క్రీడాకారుణులకే దక్కింది. 2014 ఇంచియాన్ ఆసియా గేమ్స్‌ స్క్వాష్‌ ఉమెన్స్ సింగిల్స్‌లోనూ  కాంస్యం నెగ్గిన దీపిక పల్లికల్‌కు ప్రస్తుత గేమ్స్‌లోనూ బ్రాంజ్ మెడల్‌  మాత్రమే దక్కడం విశేషం.స్క్వాష్‌లో వచ్చిన రెండు పతకాలతో 18వ ఏషియాడ్‌ మెడల్స్ టేబుల్‌లో భారత పతకాల సంఖ్య 27కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Squash  Nicol David  Jakarta  Dipika Pallikal Karthik  Dipika Pallikal  Asian Games  sports  

Other Articles