Neeraj Chopra bags Gold medal జావెలిన్ త్రో లో స్వర్ణంతో మెరిసిన నీరజ్

Javelin neeraj chopra wins gold at sotteville athletics meet

Neeraj Chopra, athletics, sotteville athletics meet, Javelin Throw, gold medal, sports, sports news, latest sports news, sports

India's ace javelin thrower Neeraj Chopra has bagged a Gold medal at the Sotteville Athletics meet in France by throwing 85.17 metres.

జావెలిన్ త్రో లో స్వర్ణంతో మెరిసిన నీరజ్

Posted: 07/18/2018 04:42 PM IST
Javelin neeraj chopra wins gold at sotteville athletics meet

ఫ్రాన్స్ లో జరుగుతున్న సొట్టేవిల్లే అథ్లెటిక్స్‌ మీట్ లో భారత స్టార్‌ జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రా అద్భుత ప్రతిభను కనబర్చాడు. తన మెరుగైన అటతీరును ప్రదర్శించిన నీరజ్.. జావెలిన్ త్రోలో పసిడి పతకాన్ని గెలుపొందాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా‌లోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత్‌కి బంగారు పతకాన్ని అందించిన ఈ స్టార్‌ అథ్లెట్.. తాజాగా ఫ్రాన్స్ లో జరిగిన అథ్లెటిక్స్ మీట్‌ ఫైనల్లో జావెలిన్ ను రికార్డు స్థాయిలో 85.17 మీటర్లు విసిరి స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు.

చోప్రా తర్వాత స్థానంలో మోల్దోవన్ జావెలిన్‌ త్రోయర్‌ ఆండ్రియన్ 81.48 మీటర్లతో రజత పతకాన్ని గెలుపొందగా.. లితివేనియా అథ్లెట్‌ ఈడిస్ 79.31 మీటర్లతో కాంస్య పతకం గెలుపొందాడు. అయితే అనూహ్యంగా.. 2012 ఒలింపిక్ ఛాంపియన్‌ వాల్కాట్‌ 78.26 మీటర్లు మాత్రమే జావెలిన్ ను విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2016‌లో జరిగిన వరల్డ్‌ అండర్-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్ ‌షిప్ లో జావెలిన్ ను 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పిన నీరజ్ చోప్రా మళ్లీ ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోతున్నాడు.

ఈ ఏడాది ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో 86.47 మీటర్లతో ఆ రికార్డు దరిదాపుల్లోకి వచ్చినా.. తాజాగా 85.17 మీటర్లే జావెలిన్ ను చోప్రా విసరడం కొసమెరుపు. 2016లో కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినప్పటికీ రియో ఒలింపిక్స్‌కి అర్హత సాధించలేకపోయిన ఈ స్టార్ జావెలిన్ త్రోయర్.. త్వరలోనే ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్ లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neeraj Chopra  athletics  sotteville athletics meet  Javelin Throw  gold medal  sports  

Other Articles