Sindhu, Saina, Srikanth storm into pre-quarters ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన సైనా, సింధూ

Saina nehwal pv sindhu kidambi srikanth advance to pre quarters

commonwealth games 2018, pv sindhu, saina nehwal, Kidambi Srikanth, HS prannoy, Indian athlets, cwg 2018, cwg, Common Wealth Games, sports, badminton

In Commonwealth Games 2018, Indian shuttlers featuring Saina Nehwal, PV Sindhu, Kidambi Srikanth, HS Prannoy began their individual campaigns in the Round of 32 in their respective categories.

ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన సైనా, సింధూ

Posted: 04/11/2018 04:30 PM IST
Saina nehwal pv sindhu kidambi srikanth advance to pre quarters

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు జోరు కొనసాగిస్తున్నారు. ఇవాళ బ్యాడ్మింటన్ విభాగంతో మన షెట్లర్లు కూడా మరో అడుగు ముందుకేసి పసిడి పతక సాధన దిశగా దృష్టి సారించారు. స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధూ సహా అటు రిత్వికా, ఇటు పురుషుల బ్యాడ్మింటన్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్, హెఛ్ఎస్ ప్రణాయ్ తదితరులు ప్రీక్వార్టర్స్‌లోని అడుగుపెట్టారు. ఇవాళ కరారా స్పోర్ట్స్ అరేనాలో జరిగిన ఉమెన్స్ సింగిల్స్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా క్రీడాకారిణి ఎల్సీ డీవిలియర్స్‌పై సైనా నెహ్వాల్ అలవోకగా విజయం సాధించింది.

లండన్ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత అయిన సైనా... సౌతాఫ్రికా క్రీడాకారిణిపై 21-3, 21-1 తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. కేవలం 18 నిమిషాల్లో తనదైన శైలిలో ఆట ముగించి ప్రీక్వార్ట్స్‌లోకి దూసుకెళ్లింది. ఇక కీలకమైన క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టేందుకు సైనా ఐల్ ఆఫ్ మాన్‌కు చెందిన జెస్సికా లీతో తలపడనుంది. కాగా మరో ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధూ దుమ్మురేపింది. ఫిజికి చెందిన ఆండ్రా వైట్‌సైడ్‌పై 21-6, 21-3 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కూడా కేవలం 18 నిముషాల్లో ముగియడం విశేషం.
 
మరోవైపు మెన్స్ సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ కూడా ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. 26 నిమిషాలు పాటు సాగిన ఈ మ్యాచ్‌లో మారిషస్‌కి చెందిన ఆటిష్ లూబాపై 21-13, 21-10 తేడాతో శ్రీకాంత్ విజయం సాధించాడు. తర్వాతి రౌండ్‌లో శ్రీకాంత్ శ్రీలంక క్రీడాకారుడు నీలుక కరుణరత్నేతో తలపడనున్నాడు. తాజా కామన్వెల్త్ క్రీడా సంగ్రామంలో భారత అథ్లెట్లు ఇప్పటి వరకు 24 పతకాలు సాధించగా.. అందులో 12 బంగారు పతకాలు, నాలుగు రజతాలు, ఎనిమిది కాంస్య పతకాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian athlets  Saina Nehwal  PV Sindhu  Common Wealth Games  sports  badminton  

Other Articles