CWG: Weightlifter Gururaja wins silver గురురాజా రజతంతో ఖాతా తెరిచిన భారత్

Gururaja claims silver opens india s cwg medal account

Commonwealth Games, Commonwealth Games 2018,Gold Coast, CWG 2018, CWG, Gururaja, weightlifting championship, first medal for India, Mirabai Chanu, Muhammad Azroy, P Gururaja, S Sathish, Sushil Kumar, weightlifting, sports news,sports, latest sports news, cricket

Gururaja was up against Chaturang Lakmal of Sri Lanka and Muhammad Azroy of Malaysia. The 25-year-old Indian would go on to finish behind both of them, and end with a bronze medal.

గురురాజా రజతంతో ఖాతా తెరిచిన భారత్

Posted: 04/05/2018 04:53 PM IST
Gururaja claims silver opens india s cwg medal account

ఆస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్ రాష్ట్రం గోల్డ్ కోస్ట్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమైన 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణి కొట్టింది. అస్ట్రేలియా గడ్డపై జరగుతున్న ఈవెంట్లలో భారత్ ఘనంగా తిరిగిరావాలని అశిస్తున్న క్రీడాభిమానులు, దేశ ప్రజల అశలను నిలబెట్టే దిశగా అసీస్ కు చేరుకున్న భారత క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్ పతకాల ఖాతాను తెరిచింది.

వెయిట్ లిప్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించి భారత ఖాతాలో పతకాన్ని వేశారు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచారు. మలేసియా వెయిడ్ లిఫ్టర్ మహ్మద్ ఇజార్ అహ్మద్ 261 కిలోల బరువును ఎత్తి స్వర్ణ పతకం సాధించగా, శ్రీలంక లిఫ్టర్ లక్మల్ 248 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం సాధించారు. కాగా, కోస్టల్ కర్ణాటకలోని కుందపురకు చెందిన గురురాజా తొలుత రెజ్లర్ గా కెరీర్ ప్రారంభించి పవర్ లిఫ్టింగ్‌కు, ఆ తర్వాత వెయిట్‍లిఫ్టింగ్‌కు మారారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : guru raja  silver medal  weightlifting  Commonwealth Games  sports  

Other Articles