Sindhu, Srikanth, win top honours in ESPN.in Awards సింధూ, శ్రీకాంత్ లకు స్పోర్ట్స్‌ పర్సన్స్‌ ‌ఆఫ్‌ ద ఇయర్ అవార్డులు

Sindhu srikanth bag top honours at espn multi sport awards

Badminton, Telugu people, Sport in India, Pullela Gopichand, Srikanth Kidambi, Pullela, P. V. Sindhu, Kidambi, Gopichand, Gopichand Badminton Academy, Badminton in India, Closed End Funds, Somdev Devvarman, Olympics, Columbia, coach, Rohit Brijnath, Aparna, sports news,sports, latest sports news

Shuttlers ruled the roost as PV Sindhu and Kidambi Srikanth were today named 'Sportspersons of the Year' with their coach Pullela Gopichand being adjudged 'best coach' at the inaugural ESPN Multi-Sport Awards.

సింధూ, శ్రీకాంత్ లకు స్పోర్ట్స్‌ పర్సన్స్‌ ‌ఆఫ్‌ ద ఇయర్ అవార్డులు

Posted: 04/02/2018 08:24 PM IST
Sindhu srikanth bag top honours at espn multi sport awards

ప్రపంచస్థాయిలో స్టార్‌ బ్యాడ్మింటన్ క్రీడాకారులుగా వెలుగొందుతున్న భారత షెటర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ ఇటు దేశీయంగా అవార్డులను అందుకున్నారు. తాజాగా స్పోర్ట్స్‌ పర్సన్స్‌ ‌ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులను సింధూ, శ్రీకాంత్ లు దక్కించుకున్నారు. కాగా ఉత్తమ కోచ్ అవార్డును పుల్లెల గోపీచంద్ కైవసం చేసుకున్నారు. ఈఎస్పీఎన్ తొలిసారిగా పలు విభాగాల్లో క్రీడాకారులకు అవార్డులు ప్రకటించింది. 11 విభాగాలకు చెందిన క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించారు.

అభినవ్ బింద్రా, సోమ్ దేవ్‌, బైచుంగ్ భూటియా, జగ్బీర్ సింగ్, రోహిత్ బ్రిజ్ నాథ్‌, వెంకటేశన్ దేవరాజన్‌, నిషా మిల్లట్‌, అపర్ణ పొపట్‌, జగదీశ్‌, మనీషా, అంజుబాబీ జార్జ్ తో కూడిన జ్యూరీ బృందం విజేతలను ఈ 11 అంశాలలో విజేతలను ప్రకటించింది. గత ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సొంతం చేసుకున్న కిదాంబి శ్రీకాంత్ కు పురుషుల విభాగంలో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేశారు. ఇక మహిళల విభాగంలో పీవీ సింధుకు ఈ అవార్డు దక్కింది. ఇక కోచ్ విషయానికి వస్తే పుల్లెల గోపీచంద్‌ బెస్ట్‌ కోచ్‌ అవార్డును కైవసం చేసుకున్నారు.

ఆసియా కప్‌ గెలిచిన మహిళల హాకీ జట్టును ‘టీం ఆఫ్‌ ద ఇయర్‌’గా ప్రకటించారు. గత ఏడాది భారత్లో అండర్‌-17 ఫిఫా ప్రపంచకప్ లో భారత్‌ తరఫున ఏకైక గోల్ ను జీక్సన్‌ సింగ్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ పోల్ లో దీనికే ఎక్కువ మంది ఓటు వేయడంతో ‘మూమెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఇది నిలిచింది. దీంతో మొత్తానికి పదకొండు విభాగాలకు చెందిన క్రీడాకారుల ప్రతిభ అవార్డులను ఈఎస్పీఎన్ సంస్థ వెల్లడించి అవార్డులను ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles