Yonex says goodbye to Sindhu పీవీ సింధూకు గుడ్ బై చెప్పిన యోనెక్స్

Yonex instagram account threatens to end sponsorship deal with sindhu

pv sindhu, yonex, yonex sindhu sponsorship, yonex hack, pv sindhu sponsorship, yonex sponsorship, Badminton, P.V Sindhu, Yonex, badminton news, badminton, sports news, sports

PV Sindhu confirmed that Yonex Instagram account was hacked and said that she looks forward to the continued support from the Japanese company.

పీవీ సింధూకు గుడ్ బై చెప్పిన యోనెక్స్

Posted: 02/12/2018 03:25 PM IST
Yonex instagram account threatens to end sponsorship deal with sindhu

ఒలంపిక్స్ రజత పతకం విజేత పీవి సింధూను అట నుంచి దృష్టి మరల్చే ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో అమె ఒక్కసారిగా అతిపెద్ద షాక్ కు గురైంది. అసలు ఉన్నపళంగా ఇలాంటి నిర్ణయం తనను విస్మాయానికి గురిచేయగా, ఆ తరువాత కొద్దిసేపటికే అసలు విషయం తెలియడంతో ఆమె ఊరట పొందింది. దీనికంతటికీ కారణం సోషల్ మీడియా పైన అధిపత్యం చాటుకునే వారి ప్రమేయమేనని, ఇలాంటి ఘటన పునారవృతం కాకుండా చూసుకుంటామని సంస్థ యాజమాన్యం అమెకు క్షమాపణలు చెప్పింది.

అసలేం జరిగింది..? అంటే.. తన ఆటపై దృష్టి సారించిన భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూకు.. తన బ్యాడ్మింటన్ స్పాన్సర్ సంస్థ యోనెక్స్  నుంచి ఓ సందేశం అందింది. అది చూసి చూడగానే అమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. అసలేం జరిగింది.. అని అరా తీయడం ప్రారంభించింది. సారాంశమేంటంటే.. "గుడ్‌ బై సింధు.  ఇండియా వంటి పేద దేశానికి చెందిన ఆటగాళ్లు ఇక మా స్పాన్సర్‌ షిప్‌ పొందబోరు. ఇక మా దృష్టంతా జపాన్‌ యువ క్రీడాకారులపైనే" అన్నది యోనెక్స్ నుంచి సింధుకు వచ్చిన మెసేజ్.

దాంతో అవాక్కైన సింధు, నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నాల్లో ఉండగానే, మరో మెసేజ్ వచ్చింది. తమ మెసేజ్ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని, దాని ఫలితమే ఈ మెసేజ్ అని స్పష్టం చేసింది. తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి తమకు తెలియకుండానే పోస్టులు వెళ్లాయని చెబుతూ, సింధుకు క్షమాపణలు చెప్పింది. ఇకపై ఇలా జరుగకుండా చూసుకుంటామని యోనెక్స్ చెప్పడంతో సింధు ఊపిరి పీల్చుకుంది.  యోనెక్స్ సంస్థ పీవి సింధూతో పాటు భారత్ నుంచి లియాండర్ పేస్, సైనా నెహ్వాలకు కూడా స్పాన్సర్ షిఫ్ అందిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Badminton  P.V Sindhu  Yonex  PV Sindhu Yonex  Sindhu Yonex  badminton  sports  

Other Articles

 • Cwg 2018 bajrang punia storms to wrestling gold silver for pooja dhanda

  కామన్వెల్త్ గేమ్స్: రెజ్లింగ్ లో స్వర్ణంతో మెరిసిన భజరంగ్..

  Apr 13 | ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న 21వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే గత స్వర్ణ పతకాల రికార్డులను తిరగరాస్తూ.. ఇప్పటికే 15 స్వర్ణాలతో వున్న గ్లాస్కో రికార్డును బద్దలు... Read more

 • Commonwealth games 2018 shreyasi singh wins double trap gold

  షూటింగ్ విభాగంలో స్వర్ణంతో మెరిసిన శ్రేయసీ సింగ్..

  Apr 11 | ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా సంగ్రామంలో భారత్ ఇవాళ మరో స్వర్ణ పతకం గెలుచుకుంది. మహిళల డబుల్‌ ట్రాప్‌ షూటింగ్‌లో భారత షూటర్ శ్రేయసి సింగ్‌ స్వర్ణ పతకం సాధించింది. నాలుగు... Read more

 • Saina nehwal pv sindhu kidambi srikanth advance to pre quarters

  ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన సైనా, సింధూ

  Apr 11 | ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు జోరు కొనసాగిస్తున్నారు. ఇవాళ బ్యాడ్మింటన్ విభాగంతో మన షెట్లర్లు కూడా మరో అడుగు ముందుకేసి పసిడి పతక సాధన దిశగా... Read more

 • Cwg 2018 day 5 india clinch three gold medals

  కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో పది స్వర్ణాలు..

  Apr 09 | అస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తన హావాను కొనసాగిస్తుంది. భారత క్రీడాకారులు తమ అధ్భుత ప్రదర్శనలతో సత్తాను చాటుతూ పతకాల పంట పండిస్తున్నారు. మొత్తంగా పది పసిడి,... Read more

 • Cwg 2018 sathish kumar sivalingam wins gold medal in 77 kg weightlifting

  సతీష్ కుమార్ స్వర్ణంతో భారత్ ఖాతాలో మూడు..

  Apr 07 | ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ కు మరో స్వర్ణం వచ్చింది. వరుసగా మూడు రోజుల నుండి ఒక్కటే విభాగంలో భారత క్రీడాకారులు స్వర్ణ పతకాలను సాధిస్తున్నారు. తొలి రోజు... Read more

Today on Telugu Wishesh