WFI issues notice to Sushil Kumar సుశీల్ కుమార్ కు డబ్యూఎఫ్ఐ నోటీసులు

Wrestling federation of india issues notice to sushil kumar

sushil kumar, sushil kumar wrestling, sushil kumar parveen rana, parveen rana fight, sushil kumar fight, wrestling news, india wrestling, sports news, sports news, latest sports news, latest news

Parveen Rana wrote to the WFI earlier this week, accusing Sushil Kumar and his supporters of beating up him and his brother Naveen.

సుశీల్ కుమార్ కు డబ్యూఎఫ్ఐ నోటీసులు

Posted: 01/05/2018 08:52 PM IST
Wrestling federation of india issues notice to sushil kumar

భారత్‌కు రెండు ఒలింపిక్‌ పతకాలు అందించిన స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) నోటీసులు జారీ చేసింది. డిసెంబరు 29న కామన్వెల్త్‌ క్రీడల రెజ్లింగ్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ సందర్భంగా సుశీల్‌, మరో రెజ్లర్‌ రాణా మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై వివరణ కోరుతూ డబ్ల్యూఎఫ్‌ఐ తాజాగా సుశీల్‌కు నోటీసులు జారీ చేసింది.

ఘర్షణపై పర్వీన్‌ రాణా డబ్ల్యూఎఫ్‌ఐను ఆశ్రయించాడు. దీనికి స్పందించిన అధికారులు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేదంటే తదుపరి చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంటూ సుశీల్‌కు నోటీసులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే.. కామన్వెల్త్‌ క్రీడల రెజ్లింగ్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ డిసెంబరు 29న దిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు. ఆ సమయంలో రెజ్లర్లు సుశీల్‌ కుమార్‌, పర్వీన్‌ వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఇండోర్‌ స్టేడియం రణరంగంగా మారింది. సుశీల్ సెమీఫైనల్లో రాణాపై విజయం అనంతరం గొడవ మొదలైంది.

సుశీల్‌తో పోటీపడేందుకు సాహసించినందుకు తనను, తన అన్నను అతడి మద్దతుదారులు కొట్టారని రాణా ఆరోపించాడు. బౌట్‌ సందర్భంగా రాణా తనను కొరికాడని సుశీల్‌ చెప్పాడు. ఐతే ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌లో పాల్గొంటే తనను చంపుతామంటూ సుశీల్‌ మద్దతుదారులు బెదిరిస్తున్నారని రాణా ఆరోపించాడు. ఈ ఘర్షణపై రాణా దిల్లీ పోలీసులకు ఫర్యాదు చేయడంతో వారు సుశీల్‌తో పాటు అతని మద్దతుదారులపై కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sushil kumar  wrestling  parveen rana  wrestling news  india wrestling  sports news  

Other Articles