House okays Srikanth's appointment ఇక కిదాంబి శ్రీకాంత్ కూడా ఢిఫ్యూటీ కలెక్టరే..

Kidambi srikanth is now deputy collector of andhra pradesh

kidambi srikanth, badminton, deputy collector, PV sindhu, shuttler, amaravathi, AP assembly, andhra pradesh, sports news, badminton news, latest badminton news, latest sports news, latest news

The Assembly passed a resolution approving the appointment of Guntur-born Indian shuttler Kidambi Srikanth as Deputy Collector.

ఇక కిదాంబి శ్రీకాంత్ కూడా ఢిఫ్యూటీ కలెక్టరే..

Posted: 12/02/2017 07:08 PM IST
Kidambi srikanth is now deputy collector of andhra pradesh

మరో భారత బ్యాడ్మింటన్ కు అరుదైన గౌరవం దక్కింది. అగ్రశ్రేణి షట్లర్ తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పించింది. దీనికి సంబంధించిన బిల్లుకు శనివారం(డిసెంబర్-2) అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గతంలో ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధుకు ఏపీ సర్కారు డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పించింది.

గుంటూరుకు చెందిన కిదాంబి శ్రీకాంత్‌ ఈ ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాడు. జూన్‌లో ఇండోనేషియా ఓపెన్‌తో పాటు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ను కౌవసం చేసుకున్న శ్రీకాంత్‌ అక్టోబరులో డెన్మార్క్‌ ఓపెన్‌, ఆ తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లు సొంతం చేసుకున్నాడు. దీంతో ఒకే ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచిన మొదటి ఇండియన్ గా రికార్డు సృష్టించాడు.

డిసెంబరు 13 నుంచి 17 వరకు దుబాయ్‌లో జరిగే బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌కు శ్రీకాంత్‌  అర్హత సాధించాడు. ఈ ఏడాది తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా ప్రపంచ పురుషుల సింగిల్స్‌లో ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. శ్రీకాంత్‌ అసాధారణ ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదాతో గౌరవించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kidambi srikanth  badminton  deputy collector  PV sindhu  shuttler  amaravathi  AP assembly  andhra pradesh  

Other Articles