Mirabai Chanu wins gold in World Championships 22 ఏళ్ల తరువాత వెయిట్ లిఫ్టింగ్ లో మళ్లీ స్వర్ణం..

Mirabai chanu wins india s first world championships gold in 22 years

World Championships,Weightlifting,Thunya Sukcharoen,Mirabai Chanu,Karnam Malleswari, common wealth games, world championship news, weight lifting, weight lifting news, sports news,sports, latest sports news

India won its first weightlifting World Championships gold medal since 1995 when Mirabai Chanu defeated the Thai favourite Thunya Sukcharoen in the women's 48kg.

22 ఏళ్ల తరువాత వెయిట్ లిఫ్టింగ్ లో మళ్లీ స్వర్ణం..

Posted: 11/30/2017 06:55 PM IST
Mirabai chanu wins india s first world championships gold in 22 years

అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడింది. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం దక్కింది. కాలిఫోర్నియాలోని అనాహిమ్ పట్టణంలో జరుగుతోన్న పోటీల్లో భారత్ కు చెందిన మీరాబాయ్ చాను స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. కరణం మల్లీశ్వరి తర్వాత ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం గెలిచిన రెండో క్రీడాకారిణిగా చాను నిలిచింది.

1994, 1995లో కరణం మల్లీశ్వరి స్వర్ణం సాధించి.. భారత్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఓ సంచలన క్రీడాకారిణిగా అవతరించింది. 48 కేజీల విభాగంలో పాల్గొన్న 23 ఏళ్ల చాను మొత్తం 194 (స్నాచ్ 85, క్లీన్ అండ్ జెర్క్‌-109)కేజీలు ఎత్తి సరికొత్త రికార్డు సృష్టించి స్వర్ణం దక్కించుకుంది. థాయ్ లాండ్, కొలంబియాకు చెందిన క్రీడాకారిణీలు రజతం, కాంస్య పతకాలు అందుకున్నారు.

స్వర్ణ పతకం అందుకునేందుకు పోడియం వద్దకు వెళ్లే సమయంలో చాను ఉద్వేగానికి లోనైంది. మణిపూర్ కు చెందిన చాను గత ఏడాది రియో ఒలింపిక్స్ కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఐతే తుది పోరుకు అర్హత సాధించడంలో విఫలమై వెనుదిరిగిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : World Championships  Weightlifting  Thunya Sukcharoen  Mirabai Chanu  Karnam Malleswari  

Other Articles