Sindhu eases into Hong Kong Open semis హాంగ్ కాంగ్ ఓపెన్ లో సెమీస్ కు సింధు

Pv sindhu enters semi finals of hong kong open super series

Hong Kong Open Super Series, Japan, Akane Yamaguchi, PV Sindhu, Aya Ohori, badminton, sports

Four weeks after a pathetic loss PV Sindhu exacted revenge against Akane Yamaguchi to book a spot in the semifinals of the Hong Kong Open Super Series in Kowloon

హాంగ్ కాంగ్ ఓపెన్ లో సెమీస్ కు సింధు

Posted: 11/24/2017 06:59 PM IST
Pv sindhu enters semi finals of hong kong open super series

హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో రెండోసీడ్‌ పీవీ సింధు జోరు ప్రదర్శిస్తూ సెమీస్‌కు దూసుకుపోయింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ మూడో ర్యాంకర్‌ సింధు 21-12, 21-19తో ఐదో సీడ్‌ అకానె యమగూచి (జపాన్‌)ని చిత్తుచేసింది. సెమీస్‌లో ఆరో సీడ్‌ రచనోక్‌ ఇంతనోన్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు తలపడనుంది. రచనోక్‌ క్వార్టర్‌ఫైనల్లో 21-14, 21-16తో మిచెల్లి లీ (కెనడా)పై సునాయాసంగా గెలుపొందింది.

సింధుపై 4-1తో రచనోక్‌ మెరుగైన రికార్డు కలిగి ఉంది. యమగూచితో 37 నిమిషాలు సాగిన క్వార్టర్స్‌లో సింధు పూర్తి ఆధిక్యం కనబరిచింది. తొలి గేమ్‌లో సింధుదే హవా. దూకుడుగా ఆడిన ఆమె గేమ్‌పై పట్టు సాధించింది. అయితే రెండోగేమ్‌ లో ఓ దశలో సింధు వెనుకపడినా అంతలోనే తేరుకుని ప్రత్యర్థికి బ్రేక్‌ వేసింది. చివరి రెండు పా యింట్ల కోసమైతే అటు సింధు ఇటు యమగూచి హోరాహోరీగా తలపడ్డారు. కానీ చివర్లో పొరపాట్లకు చోటివ్వని సింధు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hong Kong Open Super Series  Japan  Akane Yamaguchi  PV Sindhu  Aya Ohori  badminton  sports  

Other Articles