Heena Sidhu gives a golden start స్వర్ణం పతకంతో హీనా సిద్దూ శుభారంభాం

Heena sidhu wins gold at commonwealth shooting championships

Shooting, jithu rai, Heena Sidhu, gagan narang, Commonwealth shooting championships, Brisbane, Indian shooter, gold medal

Shooter Heena Sidhu continued her terrific form this year winning gold in the women's 10m Air Pistol event at the Commonwealth Shooting Championships, Brisbane

స్వర్ణంతో శుభారంభాన్నిచ్చిన హీనా సిద్దూ

Posted: 10/31/2017 07:42 PM IST
Heena sidhu wins gold at commonwealth shooting championships

భారత షూటర్ హీనా సిద్ధూ మరోసారి తనదైన ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో సత్తా చాటింది. బ్రిస్బేన్ లో జరుగుతోన్న కామన్ వెల్త్ షూటింగ్ ఛాంపియన్ షిప్ టోర్నీలో హీనా వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించింది. టోర్నీలో భాగంగా ఈ రోజు నిర్వహించిన 10మీటర్ల ఎయిర పిస్టల్ విభాగంలో హీనా 240.8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా (238.2), క్రిస్టీ గిల్మన్(213.7) రజత, కాంస్య పతకాలను దక్కించుకున్నారు.

అలాగే పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత్ కు చెందిన దీపక్ కుమార్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ఫైనల్లో జీతూరాయ్ తో కలిసి మిక్స్ డ్ డబుల్స్‌ విభాగంలో హీనా స్వర్ణం దక్కించుకుంది. ఇదే ఏడాది మే మాసంలో గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ లిబరేషన్ ప్లాజా షూటింగ్ ఛాంపియన్స్ షిప్ లో హీనా 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం గెలుచుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles