Kidambi Srikanth climbs to fourth in BWF rankings డెన్మార్క్ ఓపెన్ టైటిల్ తో నాలుగో స్థానంలో..

Denmark open makes kidambi srikanth jumps to fourth in bwf rankings

kidambi srikanth, srikanth, bwf ranking, srikanth ranking fourth, saina nehwal, hs prannoy, pv sindhu, Denmark Open, bwf ranking, fourth position, badminton, badminton news, sports news, sports, badminton

Kidambi Srikanth jumped four places after winning the Denmark Open title in the BWF Rankings to sit on the fourth position.

డెన్మార్క్ ఓపెన్ టైటిల్ తో నాలుగో స్థానంలో..

Posted: 10/26/2017 08:37 PM IST
Denmark open makes kidambi srikanth jumps to fourth in bwf rankings

బ్యాడ్మింట‌న్ వ‌ర‌ల్డ్ ఫెడ‌రేష‌న్ విడుద‌ల చేసిన తాజా ప్రపంచ ర్యాకింగ్స్ లో భారత బాడ్మింటన్ సంచలనం.. కిడాంబి శ్రీకాంత్ నాలుగో స్థానాన్ని అందుకున్నాడు. ఈ నెలలోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన డెన్మార్క్ సూప‌ర్ సిరీస్ ను కైవ‌సం చేసుకున్న కిదాంబి ఏకంగా నాలుగు స్థానాలను ఎగబాకాడు. ఈ విజయంతో 66923 పాయింట్లు సాధించి నాలుగో ర్యాంకును అందుకున్నాడు.

కిదాంబి శ్రీకాంత్ కంటే ముందు స్థానాల్లో విక్ట‌ర్ అలెక్సన్‌, సోన్ వా హో, లిన్ డాన్లు ఉన్నారు. 2015లో ఒక‌సారి శ్రీకాంత్ మూడో ర్యాంక్ వ‌ర‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం జ‌రుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూప‌ర్ సిరీస్ కూడా గెలిస్తే శ్రీకాంత్ ర్యాంక్ మ‌రింత మెరుగుప‌డే అవ‌కాశం ఉంది.

ఇత‌ర భార‌త క్రీడాకారులైన హెచ్ ఎస్ ప్ర‌ణ‌య్‌, స‌మీర్ వ‌ర్మలు వ‌రుస‌గా 12, 18 ర్యాంకుల్లో నిలిచారు. అజ‌య్ జైరాం 23వ స్థానంలో నిలిచాడు. ఇక మ‌హిళా క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ ర్యాంకు ఒక స్థానం మెరుగుప‌డింది. ఆమె 12వ స్థానం నుంచి 11వ ర్యాంకుకు చేరుకుంది. పీవీ సింధు త‌న రెండో స్థానంలోనే కొన‌సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kidambi srikanth  Denmark Open  bwf ranking  fourth position  badminton  

Other Articles