India maul Japan 5-1 in Asia Cup hockey అసియా కప్ లో.. టీమిండియా విజయంతో బోణి

Clinical india maul japan 5 1 in asia cup hockey opener

Asia cup, SV Sunil, Ramandeep, Lalit Upadhyay, Kenji Kitazato, India v Japan, Harmanpreet Singh, Akashdeep Singh, hockey news, sports news, asia cup news, hockey updates, sports, hockey

Title favourites India produced an impressive performance to outclass Japan 5-1 in their opening campaign at the 10th edition of the men' Asia Cup hockey tournament

అసియా కప్ లో.. టీమిండియా విజయంతో బోణి

Posted: 10/12/2017 10:52 AM IST
Clinical india maul japan 5 1 in asia cup hockey opener

బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న హాకీ ఆసియాకప్ లో టీమిండియా శుభారంభం చేసింది. జపాన్ తో జరిగిన మ్యాచులో టీమిండియా 5-1తో ఘనవిజయం సాధించింది. మ్యాచు తొలి అర్థ భాగం నుంచి చివరి వరకు భారత ఆటగాళ్లు ఆధిపత్యాన్ని చలాయించారు. భారత ఆటగాడు ఎస్‌వీ సునీల్ మూడో నిమిషంలో తొలి గోల్ సాధించారు. దీనికి ధీటుగా జపాన్ జట్టు కూడా ధాటిగా. అడింది.

జపాన్ ప్లేయర్ కెంజి కిటజటో నాలుగో నిమిషంలో గోల్‌ సాధించాడు. దీంతో ఇరు జట్ల స్కోరును సమంగా మారింది. అనంతరం మ్యాచ్ ఉత్కంఠగా సాగుంతుండగా భారత ఆటగాడు లలీల్ ఉపాధ్యాయ 22 నిమిషంలో గోల్ సాధించాడు. దీంతో భారత్ 2-1 తో ఆధిక్యం సాధించింది. ఆక్కడి నుంచి భారత ఆటగాళ్లు ఆటపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించారు.

జపాన్ అటగాళ్లు ఏక్కడా అవకాశం ఇవ్వకుండా బాగా రాణించారు. రమణ్ దీప్ సింగ్ 33 నిమిషంలో మరో గోల్ సాధించగా.. హర్మన్ ప్రీత్ సింగ్ 35వ, 48 నిమిషాల్లో వరుస గోల్స్‌ సాధించడంతో భారత్ విజయం సులువైంది. ఇటీవలె భారత హాకీ జట్టుకు కొత్త కోచ్ స్జోయెర్డ మరిజ్న ను నియమించిన విషయం తెలిసిందే‌. ఇక భారత్ తరువాతి మ్యాచ్ ఆతిథ్య బంగ్లాదేశ్ తో శుక్రవారం జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles