5 Indian men's singles shuttlers ranked in top-20 చరిత్రాత్మకం: టాప్ 20 జాబితాలో ఐదుగురు మనవాళ్లే..

5 indian male shuttlers top 20 singles in bwf ranking

Badminton, PV Sindhu, BWF Kidambi Srikanth, HS Prannoy, B Sai Praneeth,Ajay Jayaram, Sameer Verma, mens singles, sindhu badminton, japan super series 2017, india badminton, badminton news, Badminton, sports news, latest badminton news, latest sports news

Despite a disappointing campaign at the recently concluded Japan Open Super Series , as many as five Indian shuttlers have entered inside top 20 of BWF singles ranking.

చరిత్రాత్మకం: టాప్ 20 జాబితాలో ఐదుగురు మనవాళ్లే..

Posted: 09/28/2017 09:11 PM IST
5 indian male shuttlers top 20 singles in bwf ranking

ప్రపంచ బ్యాడ్మింటన్ మనవాళ్లు చరిత్ర సృష్టించారు. అదేంటి అంటారా.. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో వరుసక్రమంలో అటు సైనా నెహ్వాల్, పీవీ సింధూ నుంచి కిదాంబి శ్రీకాంత్ సహా అందరూ ఇంటికి తిరుగుముఖం పట్టిన నేపథ్యంలో మనవాళ్లు అందులోనూ పురుషలు ఎలా చరిత్ర సృష్టించారో తెలుసుకోవాలని వుందా..? తాజాగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ‌(బీడబ్ల్యూఎఫ్) ప్రకటించిన ర్యాంకింగ్స్ లోనూ మన క్రీడాకారులు సత్తా చాటారు.

బ్యాడ్మింటన్ చరిత్రలోనే తొలిసారిగా పురుషుల సింగిల్స్ విభాగం టాప్‌-20 జాబితాలో భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో కిదాంబి శ్రీకాంత్ 8వ స్థానంతో మన అటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. హెచ్ఎస్ ప్రణయ్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 15 ర్యాంకులో కొనసాగుతున్నాడు. అయితే గతంలో 12వ ర్యాంకులో కొనసాగిన ప్రణయ్ తన ర్యాంకును కొల్పోయాడు. కొన్నాళ్ల క్రితం వరకు 19 వ ర్యాంకులో కోనసాగిన ఆయన తాజా ర్యాంకింగ్స్ లో మాత్రం 15వ ర్యాంకులో నిలిచాడు.

ఇక సాయి ప్రణీత్‌ 17వ స్థానంలో, సమీర్‌ వర్మ 19 స్థానంలో, అజయ్‌ జయరాం 20వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఈ ర్యాంకింగ్లపై స్పందించిన హెఛ్ఎస్ ప్రణాయ్.. ఇది అరంభం మాత్రమేనని వ్యాఖ్యానించాడు. మున్ముందు మన దేశ క్రీడాకారులు మరిన్ని విజయాలను అందుకుంటారని మరెన్నో అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. ఇక మహిళల సింగిల్స్‌ రాంకింగ్స్‌లో సింధు, సైనా స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. సింధు 2వ స్థానంలో.. సైనా 12వ స్థానంలో కొనసాగుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Badminton  PV Sindhu  BWF Kidambi Srikanth  HS Prannoy  B Sai Praneeth  Ajay Jayaram  Sameer Verma  

Other Articles