PV Sindhu and Nozomi Okuhara to cross swords yet again బ్యాడ్మింటన్ బద్దశత్రువుల మధ్య మరో ఫైట్..

Arch rivals pv sindhu and nozomi okuhara to cross swords yet again at japan open

Saina Nehwal, japan open badminton 2017, PV Sindhu, PM Modi, Prime Minister Narendra modi, Nozomi Okuhara, Korea Open final,Korea Open 2017, Korea Open, Son Wan, Sung Ji Hyun, Minatsu Mitani, sindhu badminton, korea super series 2017, india badminton, Badminton, sports news, latest badminton news, latest sports news

The two fine exponents of badminton Nozomi Okuhara of Japan and India’s PV Sindhu, the two arch-rivals will pit their wits against each other in the Japan Open Superseries.

బ్యాడ్మింటన్ బద్దశత్రువుల మధ్య మరో ఫైట్..

Posted: 09/19/2017 05:31 PM IST
Arch rivals pv sindhu and nozomi okuhara to cross swords yet again at japan open

భారత బ్యాడ్మింటన్ సంచలనం పివీ సింధూ మరో మారు జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహారాతో తలపడనుందా..? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల నుంచి వీరిమధ్య ప్రారంభమైన ఆటలో వైరుత్వం‌.. ఇటీవల ముగిసిన కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్తో మరింత పెరిగింది. ఇక తాజాగా ఈ నెల 24 ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ తొ ఇది మరేస్థాయికి చేరుతుందో వేచి చూడాలి.

బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ కప్ లో నొజొమి ఒకుహారా టైటిల్ సాధించగా, కొరియా ఓపెన్ లో సింధూ అందుకు ప్రతీకారం తీర్చుకుంది. దీంతో.. వీరిద్దరూ ఒకరితో మరోకరు తలపడిన తరుణంలో ఒక్కక్కరికి ఒక్కోసారి టైటిల్ దక్కింది. కాగా జపాన్ ఓపెన్ లో వీరికి ఆ అవకాశం లేదు. ఎందుకంటే.. ఈ సారి వీరిద్దరు ఫైనల్ లో కాకుండా ప్రిక్వార్టర్స్ లో పోటీపడే అవకాశముంది. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో మితాని మినత్సు (జపాన్‌)తో సింధు తలపడుతుంది.

తొలి రౌండ్‌ దాటితే ప్రిక్వార్టర్స్‌లో సింధు ప్రత్యర్థిగా ఒకుహర ఎదుర్కోవాల్సి వుంటుంది. మరోవైపు థాయ్ లాండ్ కు చెందిన పోర్న్‌పావీ చొచువాంగ్‌ తో సైనా నెహ్వాల్‌ తన పోరాటం ప్రారంభించనుంది. ఇటు సింధు.. అటు సైనా క్వార్టర్ ఫైనల్స్‌ దాటితే సెమీస్ లో భారత క్రీడాకారిణులు అమీతుమీ తేల్చుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles