I'll play to win at World Championship, says Kidambi Srikanth ప్రపంచ ఛాంపియన్ షిప్ లో గెలుపే లక్ష్యం: కిదాంబి శ్రీకాంత్

I ll play to win at world championship says kidambi srikanth

Kidambi Srikanth, Pullela Gopichand, badminton, Indonesia Open, Australian Open, Chen Long, Olympic champion, Lin Dan, Gopichand Badminton Academy, Kidambi Srikanth, Indonesia Open Super Series Premier, HS Prannoy, Australian Open Super Series, Rio Olympics

Set to regain his place in the World top 10 after winning back-to-back titles, Kidambi Srikanth has now trained his eyes on the prestigious World Championship crown.

ప్రపంచ ఛాంపియన్ షిప్ లో గెలుపే లక్ష్యం: కిదాంబి శ్రీకాంత్

Posted: 06/27/2017 06:12 PM IST
I ll play to win at world championship says kidambi srikanth

వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుని బాడ్మింటన్ ర్యాంకింగ్లలో తన గత స్థాయిని తిరిగి రాబట్టుకున్న భారత బ్యాడ్మింటన్ సంచలనం కిదాంబి శ్రీకాంత్.. తాను బీడబ్యూఎప్ ర్యాంకింగ్లలో అత్యత్తమ పది స్థానాల్లోపు ర్యాంకు కలిగివుండటంతపై సంతోషంగా వుందన్నాడు. అయితే తాను ర్యాంకుల కోసం ఏమీ చేయనని, మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతానని చెప్పారు. అస్ట్రేలియా సిరీస్ లోనూ గెలవాలన్న కాంక్షతోనే అడనని, అగస్టులో రానున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ లలో కూడా తాను గెలుపుకోసమే అడతానని అన్నాడు.

అటు ఇండోనేషియా సూపర్ సిరీస్ లో.. ఇటు అస్ట్రేలియా సూపర్ సిరీస్ లో టైటిళ్లను కైవసం చేసుకుని ఇవాళ స్వరాష్రానికి తిరిగి వచ్చిన కిదాంబి శ్రీకాంత్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.  కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల నుండి ఆయనకు ఘన స్వాగతం లభించింది. అటు నుంచి నేరుగా గోపిచంద్ అకాడమికి చేరుకున్న శ్రీకాంత్ అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గోన్నారు. తాను ఇంతగా రాటు తేలడానికి కారణం తన ప్రత్యర్థులేనని చెప్పుకోచ్చాడు. వారు తనను ఇరుకున పెట్టేందుకు కోట్టే షాట్లను ఎలా విజయాలుగా మలుచుకోవాలో అన్నది గ్రౌండ్ లోనే ప్రదర్శించి వారిని ఎదుర్కుంటున్నానన్నాడు.

తన విజయాల వెనుక తన కోచ్ ప్రమేయం కూడా ఎంతగానో వుందని శ్రీకాంత్ చెప్పారు. ఆయన పర్యవేక్షణలో నిర్వారామంగా ట్రైనింగ్ తీసుకోవడం వల్లే ఈ ఫలితం వచ్చిందన్నారు. గడిచిన రెండు వారాలు తనకు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. కేంద్ర క్రీడల శాఖ నుంచి కూడా తనకు మంచి సహకారం లభించిందన్నారు. గాయాల తర్వాత తనకు తానుగా పుంజుకున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. తనను ప్రోత్సహించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపాడు. తనతోపాటు ప్రణయ్ రాయ్‌, సాయి ప్రణీత్‌ కూడా బాగా రాణించారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles