హాంకాంగ్‌ ఓపెన్ సిరీస్ లో భారత్ రన్నర్ అప్ PV Sindhu, sameer stood runner-up in Hong Kong Open final

Pv sindhu sameer stood runner up in hong kong open final

pv sindhu, sindhu, pv sindhu india, Tai Tzu Ying, sameer, Ng Ka Long Angus, hong kong open, finals, sindhu hong kong open, hong kong open final, hong kong pv sindhu, badminton news, badminton

Rio Olympic silver medallist P V Sindhu and sameera verma who made into singles at the Hong Kong Open finals finally stood as runner-ups.

హాంకాంగ్‌ ఓపెన్ సిరీస్ లో భారత్ రన్నర్ అప్

Posted: 11/27/2016 05:09 PM IST
Pv sindhu sameer stood runner up in hong kong open final

హాంకాంగ్‌లో సూపర్‌ సిరీస్‌ భారత వర్థమాన షట్లర్లు డబుల్‌ ధమాకా సాధిస్తారని యావత్ భారత క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూడగా, వారి అశలన్నీ అడియాశలయ్యాయి.  అటు మహిళల సింగిల్స్ విభాగంతో పాటు ఇటు పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌ ఫైట్ లో పివి సింధు, సమీర్‌ వర్మలు తమ ప్రత్యర్థుల చేతిలో పరాజయం పాలై రన్నర్ అప్ లు గా నిలిచారు. ఇవాళ జరిగిన ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ సింధు 15-21, 17-21 తేడాతో మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్గా సరిపెట్టుకుంది.  

తొలి గేమ్లో పోరాడి ఓడిన సింధు.. రెండో గేమ్లో కూడా ఆకట్టుకోలేకపోయింది.  తొలి గేమ్లో 6-3 ముందంజ వేసిన సింధు.. ఆ తరువాత వరుసగా ఆరుపాయింట్లను కోల్పోయింది. దాంతో గేమ్పై పట్టు సాధించిన తై జు యింగ్ మరింత ముందుకు దూసుకుపోయింది. కాగా,  సింధు 11-18తో వెనుకబడిన దశలో  వరుసగా నాలుగు పాయింట్లు సాధించినా ఆ గేమ్ను రక్షించుకోలేపోయింది.  ఏకపక్షంగా సాగిన పోరులో తై జు యింగ్ కచ్చితమైన ప్రణాళికలతో ఆకట్టుకుని సింధును నిలువరించింది.

ఇక తన కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాలనుకున్న సమీర్ వర్మకు నిరాశ ఎదురైంది. ఇవాళ జరిగిన తుది పోరులో సమీర్ వర్మ 14-21, 21-10, 11-21 తేడాతో ఎన్జీ కా లాంగ్(హాంకాంగ్)చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్ను కోల్పోయిన సమీర్.. ఆ తరువాత రెండో గేమ్ను సునాయాసంగా గెలిచాడు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్లో సమీర్ మరోసారి తడబడ్డాడు. ప్రత్యర్థి లాంగ్కు ఎత్తులకు తలవంచిన సమీర్ ఆ గేమ్ను చేజార్చుకున్నాడు. దాంతో రన్నరప్గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pv sindhu  Tai Tzu Ying  sameer  Ng Ka Long Angus  hong kong open  finals  badminton  

Other Articles