ఓటమెరుగని బాక్సర్.. బౌట్ లో వీరమరణం.. Boxer Mike Towell dies in hospital after Glasgow fight

Boxer mike towell dies in hospital after glasgow fight

Mike Towell, Scottish boxer, Mike Towell died, Dale Evans, St Andrews Sporting Club fight, Radisson Blu Hotel, Glasgow, Queen Elizabeth University Hospital.

Mike Towell, a Scottish boxer, died in hospital. The 25-year-old was knocked down in the fifth round against Dale Evans in a St Andrews Sporting Club fight at the Radisson Blu Hotel in Glasgow on Thursday and was rushed to Queen Elizabeth University Hospital.

ఓటమెరుగని బాక్సర్.. బౌట్ లో వీరమరణం..

Posted: 10/01/2016 12:01 PM IST
Boxer mike towell dies in hospital after glasgow fight

ప్రాణాలు పణంగా పెట్టి అడటం నేటి తరం క్రీడాకారులకు పరిపాటిగా మారింది. అటలోకి దిగన వెంటనే చావో రేవో తేల్చుకునేందకు కూడా వారు సిద్దమవుతున్నారు. అలాంటి ఆటలు మరో క్రీడాకారుడి ప్రాణాలు తీశాయి. బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థితో నువ్వా నేనా అన్న తరహాలో పోటీపడిన క్రీడాకారుడ్ని చావు తన బిగికౌగిలిలో బంధించేసింది. ప్రత్యర్థి ఏకపక్ష్ దాడిలో తీవ్రంగా గాయపడిన స్కాటిష్ బాక్సర్ మైక్ టావెల్ గేమ్ తరువాత అసువులు బాసాడు. ఇంతకుముందు ఓటమి ఎరుగని వీరుడిగా బరిలో నిలిచిన మూక్ టావెల్ గతానికి భిన్నంగా ప్రత్యర్థి దాడిలో తీవ్రంగా గాయపడి మరణించడం క్రీడాప్రపంచాన్నే కలచివేసింది.

తన ప్రొఫెషనల్ కెరీర్‌లో 11 విజయాలు, ఒక డ్రాతో అజేయంగా ఉన్నాడు. డండీకి చెందిన ఈ పాతికేళ్ల బాక్సర్.. గ్లాస్గోలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన సెయింట్ ఆం డ్రూస్ స్పోర్టింగ్ క్లబ్ ఫైట్‌లో డేల్ ఇవాన్స్‌తో తలపడిన టావెల్.. ఐదో రౌండు తర్వాత ఓడిపోయాడు. అప్పటికే తీవ్రంగా గాయపడిన అతడిని నగరంలోని క్వీన్ ఎలిజబెత్ యూనివర్సిటీ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

టావెల్ మరణించే సమయానికి అతడి కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. టావెల్ మృతిచెందిన విషయాన్ని సెయింట్ ఆండ్రూస్ స్పోర్టింగ్ క్లబ్ ఒక ట్వీట్‌లో నిర్ధారించింది. నిజానికి ఈ ఫైట్ మొదటి రౌండులోనే టావెల్ పడిపోయాడు. తర్వాత కాసేపటికి కోలుకుని, మళ్లీ మ్యాచ్ మొదలుపెట్టాడు. ఐదోరౌండు లో ఉండగా.. రెండోసారి టావెల్ నాక్ డౌన్ అవడంతో రిఫరీ విక్టర్ లాఫ్లిన్ పోరాటాన్ని ఆపేశారు. అంబులెన్సులో తీసుకెళ్లడానికి ముందే ఆక్సిజన్ పెట్టి, ప్రాథమిక చికిత్స చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mike towell  scotish boxer  no more  passed away  Dale Evans  boxing ring  

Other Articles