పాక్ పై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా.. జవాన్లకు జోహార్లు.. India beat Pakistan to enter U-18 Asia Cup hockey final

India beat pakistan to enter u 18 asia cup hockey final

pr sreejesh, indian hockey, india v pakistan, asian champions trophy hockey, rajnath singh, rajnath singh twitter, rajnath singh pakistan, rajnath singh india hockey team, india u-18 asia cup, india pakistan hockey result, hockey, hockey news, sports, sports news

India defeated arch-rivals Pakistan 3-1 to storm into the summit clash of the fourth men's Under-18 Asia Cup hockey tournament

పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చకున్న టీమిండియా. జవాన్లకు జోహార్లు

Posted: 09/29/2016 09:41 PM IST
India beat pakistan to enter u 18 asia cup hockey final

ఆసియా కప్ అండర్-18 హాకీ టోర్నమెంట్‌లో భారత జూనియర్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-1 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నీలం సంజీప్ ఎక్సెస్ నేతృత్వంలోని జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఫార్వర్డ్ ఆటగాడు శివమ్ ఆనంద్ (7వ నిమిషం), స్ట్రయికర్ దిల్‌ప్రీత్ సింగ్ (32వ ని.), కెప్టెన్ సంజీప్ (46వ ని.) తలా ఒక గోల్ చేశారు. ప్రత్యర్థిని ఎక్కడికక్కడ నిలువరించడంలో రక్షణ పంక్తి కూడా సఫలమైంది.

ఆరంభం నుంచి అటాకింగ్‌తో పైచేయి సాధించాలని ఇరు జట్లు దూకుడు ప్రదర్శించారు. అయితే భారత కుర్రాళ్ల జోరు ముందు పాక్ దాడులు తేలిపోయాయి మ్యాచ్  ఏడో నిమిషంలోనే ఆనంద్ ఫీల్డ్ గోల్ సాధించగా, అనంతరం దిల్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ 2-0తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. ద్వితీయార్ధంలోనూ ఇదే జోరును కొనసాగించడంతో పాకిస్తాన్ కోలుకోలేకపోయి0ది. రెండో అర్ధభాగంలో కెప్టెన్ సంజీప్ పెనాల్టీ కార్నర్‌ని గోల్‌పోస్ట్‌లోకి పంపిస్తే... పాక్ తరఫున నమోదైన ఏకై క గోల్‌ను అంజద్ అలీ ఖాన్ 63వ నిమిషంలో చేశాడు.
 
ఈ జట్టుకు లభించిన పలు పెనాల్టీ కార్నర్లను గోల్ కాకుండా భారత ఆటగాళ్లు అడ్డుగోడగా నిలబడ్డారు. మ్యాచ్ ఆసాంతం చక్కని పోరాటం చేసిన మిడ్‌ఫీల్డర్ కున్వర్ దిల్‌రాజ్ సింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పాక్‌ను ఓడించిన భారత కుర్రాళ్లను కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్... ఆతిథ్య బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sreejesh  india hockey captain  Asian Champions Trophy  Team india  Pakistan  Uri attack  

Other Articles