Deepika Kumari equals world record at Archery World Cup

Deepika kumari equals world record india nail bronze

deepika kumari, deepika kumari india, deepika kumari archery, archery world cup, world cup archery, rio 2016, rio olympics, olympics, olympics 2016, sports news, archery news,,

Deepika Kumari scored 686/720 to equal the earlier world-record score of 686/720 set by South Korea's Ki Bo-Bae in 2015.

ప్రపంచ రికార్డును సమం చేసిన దీపికా

Posted: 04/28/2016 08:12 PM IST
Deepika kumari equals world record india nail bronze

కొత్త సీజన్‌ను భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి దీపిక కుమారి ఘనంగా ప్రారంభించింది. ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్-1 టోర్నమెంట్‌లో దీపిక క్వాలిఫయింగ్ రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్‌లో ప్రపంచ రికార్డును సమం చేసింది. 72 బాణాలు సంధించిన దీపిక 686 పాయింట్లు స్కోరు చేసి క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్‌ను సంపాదించింది.  ఈ క్రమంలో లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కీ బో బే (దక్షిణ కొరియా) పేరిట 686 పాయింట్లతో ఉన్న ప్రపంచ రికార్డును ఈ జార్ఖండ్ అమ్మాయి అందుకుంది.

దీపిక ప్రదర్శనతో ఆమెకు నేరుగా మూడో రౌండ్‌లోకి ‘బై’ లభించింది. క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ రౌండ్‌లో భారత్‌కే చెందిన బొంబేలా దేవి 645 పాయింట్లతో 34వ స్థానంలో... లక్ష్మీరాణి మాఝీ 638 పాయింట్లతో 45వ స్థానంలో... రిమిల్ బురిలీ 612 పాయింట్లతో 75వ స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురూ తొలి రౌండ్ మ్యాచ్‌లను ఆడతారు. మిక్స్‌డ్ విభాగంలో దీపిక కుమారి-అతాను దాస్ ద్వయం కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది.

క్వార్టర్ ఫైనల్లో దీపిక-అతాను జంట 5-3తో టర్కీ జోడీని ఓడించగా... సెమీస్‌లో 3-5తో చైనీస్ తైపీ ద్వయం చేతిలో ఓడి కాంస్య పతక మ్యాచ్‌లో కొరియా జంటతో పోరుకు సిద్ధమైంది. పురుషుల రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్‌లో అతాను దాస్ 12వ, జయంత తాలుక్‌దార్ 13వ, మంగళ్ సింగ్ చంపియా 20వ స్థానంలో నిలిచారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Kumari  World Cup  archery  rio olympics  bombela Devi  

Other Articles