Sardar accused of assault, denies charge

Sardar accused of assault denies charge

sardar Singh, Hockey, an assault case

Indian hockey was hit by controversy on Wednesday after an assault case was filed by a 21-year-old British woman against national captain Sardar Singh late on Tuesday night.

భారత హాకీ టీం కెప్లెన్ పై వేదింపుల కేసు

Posted: 02/04/2016 06:19 PM IST
Sardar accused of assault denies charge

భారత హాకీ పురుషుల జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. ఈ అంతర్జాతీయ స్టార్ ఆటగాడు లైంగిక వేధింపుల వివాదంలో ఇరుక్కున్నాడు. సర్దార్ తనను శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేశాడంటూ అతని ప్రియురాలు, కాబోయే భార్యగా చెప్పుకుంటున్న బ్రిటన్ హాకీ క్రీడాకారిణి లూథియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నాలుగేండ్లుగా తనకు సర్దార్ తెలుసనీ, ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిందని లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆ ఫిర్యాదులో పేర్కొంది. భారత సంతతికి చెందిన 21ఏండ్ల ఆ అమ్మాయి ప్రస్తుతం బ్రిటన్ హాకీ జట్టు ప్లేయర్. లండన్ ఒలింపిక్స్ సందర్భంగా ఇద్దరికీ పరిచయం ఏర్పడిందన్న ఆ అమ్మాయి.. అతను తనను గర్భవతిని చేసి బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది. ఈనెల 1న సర్దార్‌సింగ్‌పై ఆ అమ్మాయి తమకు ఫిర్యాదుచేసిందన్న లూథియానా పోలీస్ కమిషనర్.. ఈ కేసు విషయమై విచారణ చేస్తున్నట్టు వివరించారు.

నాలుగేండ్లుగా మా ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతున్నదన్న సంగతి భారత్‌తో పాటు విదేశాల్లో చాలామందికి తెలిసిందే. సర్దార్‌ను నేను తొలిసారి 2012 లండన్ ఒలింపిక్స్ సమయంలో కలిశాను. 2014లో వరల్డ్‌కప్ సందర్భంగా అతను నాకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత అతని స్వగ్రామం వెళ్లి అతని కుటుంబసభ్యులను కలిశాను. అక్కడే మా నిశ్చితార్థం కూడా చేశారు. ఇదంతా జరిగాక గతేడాది మధ్యలో నేను గర్భం దాల్చాను. ఇదే విషయమై సర్దార్‌కు సమాచారమిస్తే, అబార్షన్ చేసుకోవాలంటూ కోరాడు. ఇందుకు ఒప్పుకోకపోవడంతో నన్ను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించాడు. చివరకు తీవ్ర ఒత్తిడిమధ్య నేను అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది అని ఆ యువతి పేర్కొంది. కాగా తనపై బ్రిటన్ క్రీడాకారిణి చేసిన ఆరోపణలను సర్దార్‌సింగ్ ఖండించాడు. ఆమెతో పరిచయమున్న మాట వాస్తవమేననీ, కానీ తనపై వేసిన నిందలు మాత్రం సరికావన్నాడు. ఆమెతో తనకెలాంటి నిశ్చితార్థం జరుగలేదన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : sardar Singh  Hockey  an assault case  

Other Articles