tyson fury beats wladimir klitschko to become new world heavyweight champion

Tyson fury ends wladimir klitschko s heavyweight reign

Tyson Fury, Wladimir Klitschko, world heavyweight champion, Britain's Tyson Fury, WBA, WBO, IBF, heavyweight world titles, Dusseldorf.

Britain's Tyson Fury ended the nine-year reign of Wladimir Klitschko as he claimed a unanimous decision victory to claim the WBA, WBO and IBF heavyweight world titles in Dusseldorf.

అనుభవం ఓడింది.. టైసన్ ఫ్యూరీ కొత్త ఛాంపియన్

Posted: 11/29/2015 03:49 PM IST
Tyson fury ends wladimir klitschko s heavyweight reign

వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో అంచనాలకు మించి రాణించిన టైసన్ ఫ్యూరీ(బ్రిటన్) సరికొత్త చాంపియన్ గా అవతరించాడు.  బాక్సింగ్ క్రీడా చరిత్రలో గత 11 ఏళ్లుగా  ఓటమి ఎరుగకుండా అప్రతిహత జైత్రయాత్ర సాగిస్తున్న వ్లాదిమిర్ క్లిచ్ కో(ఉక్రెయిన్) కు టైసన్ ఫ్యూరీ తాజాగా చెక్ పెట్టి కొత్త చరిత్ర సృష్టించాడు.  డ్యూసెలదార్ఫ్ లో జరిగిన పోరులో టైసన్ ఫ్యూరీ 115-112, 115-112, 116-111 తేడాతో వ్లాదిమిర్ ను కంగుతినిపించాడు. 2004 నుంచి డబ్యూబీఏ, ఐబీఎఫ్, ఐబీవో, డబ్యూబీవో తదితర టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న వ్లాదిమిర్ ను టైసన్ ఫ్యూరీ  మట్టికరిపించి వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ షిప్ టైటిల్ ను ముద్దాడాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో టైసన్ ఫ్యూరీ విజయం సాధించినట్లు జడ్జిలు తమ  ఏకగ్రీవ నిర్ణయంలో ప్రకటించారు.

ఈ విజయంతో టైసన్ ఫ్యూరీ ఆనందంలో మునిగిపోయాడు. తాను విజయం సాధించినందుకు ముందుగా జీసెస్ క్రిస్ట్ కు ధన్యవాదాలు తెలిపాడు. తాను ఏమైతే చేయాలనుకున్నానో దాన్ని రింగ్ లో కచ్చితంగా అమలు చేసినట్లు ఫ్యూరీ తెలిపాడు. ఇప్పటివరకూ 25 ప్రొఫెషనల్ బౌట్లను గెలుచుకున్నతనకు వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్ గా నిలవాలన్నది ఓ కల అని ఫ్యూరీ ఆనంద బాష్పాలు రాల్చాడు.  గత కొంత కాలం నుంచి పడ్డ శ్రమకు తగిన ఫలితం దక్కిందన్నాడు. ఈ రోజు కోసం విపరీతంగా కష్టించినట్లు ఫ్యూరీ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఫ్యూరీ వేగం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వ్లాదిమిర్ తెలిపాడు. త్వరలో తన రిటైర్మెంట్ పై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వ్లాదిమిర్ తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tyson Fury  Wladimir Klitschko  World Heavyweight Champion  

Other Articles