Sports ministry recognizes Yoga as a sports discipline

Sports ministry recognizes yoga as a sports

Yoga, Sports, Soprts Ministry, India, Priority, General sports, Sports ministry

The Sports Ministry today decided to recognize Yoga as a sports discipline and place it in the Priority category. The Ministry also decided to upgrade Fencing from 'Others' to 'General' category, based on the past performance in major international events. It has also been decided to place 'University Sports' in the 'Priority' category.

యోగాను స్పోర్ట్ గా గుర్తించిన ప్రభుత్వం

Posted: 09/02/2015 06:53 PM IST
Sports ministry recognizes yoga as a sports

ప్రపంచాన్ని ఊపుఊపేసిన యోగా మీద భారత ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. యోగాను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసి కీర్తి ప్రతిష్టలను మరింత పెంచిన భారత ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసి యోగాను స్పోర్ట్ కింద (క్రీడగా) గుర్తింపునిచ్చింది. వచ్చే ఏడాది గోవాలో జరిగే జాతీయ క్రీడల్లో కూడా యోగాకు చోటు కల్పించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా మానవుడి పరిపూర్ణ ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తున్న యోగాను తాజాగా క్రీడగా గుర్తిస్తు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మీద చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే వచ్చే ఆసియా క్రీడల జాబితాలో కూడా యోగాను చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. యోగాకు ప్రయారిటీ విభాగంలో చోటిస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఫెన్సింగ్ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తుండడంతో యోగాను ఇతర క్రీడల విభాగం నుంచి జనరల్ కు మార్చారు. అంతేకాకుండా ప్రయారిటీ కేటగిరీలో ఫెన్సిం గ్‌కు యూనివర్సల్ స్పోర్ట్స్ కింద చోటిచ్చారు. మొత్తానికి యోగాకు మరింత ప్రోత్సాహాన్నిస్తు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యల మీద సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yoga  Sports  Soprts Ministry  India  Priority  General sports  Sports ministry  

Other Articles