Usain Bolt Gets Taken Down by Clumsy Cameraman on Segway

Usain bolt gets taken down by clumsy cameraman on segway

usain Bolt, Bolt, Fall down, Clumsy Cameraman, Segway, IAAF World Championship, Beijing

Jamaican runner Usain Bolt may have outrun all his competitors when he came in first in the 200-meter race at the IAAF World Championships in Beijing. But he apparently wasn't fast enough to outrun a clumsy cameraman on a Segway.

ఉస్సేన్ బోల్ట్ .. అలా బోల్తాపడ్డాడు

Posted: 08/29/2015 05:33 PM IST
Usain bolt gets taken down by clumsy cameraman on segway

వంద పీనుగలను తిన్న రాబందు ఒక్క తుఫాన్ కు చచ్చిన చందంగా తయారైంది ఉస్సేన్ బోల్డ్ పరిస్థితి. వరల్డ్ రన్నింగ్ చాంపియన్ ను చతికిలపడేసిన ఘటన అందరికి ఆశ్చర్యం కలిగింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల పరుగులో తాను స్వర్ణం గెలుస్తానని ముందే ఊహించినట్లు బోల్ట్ చెప్పాడు. కానీ అతను ఊహించని అనూహ్య ఘటన ట్రాక్‌పైనే జరిగింది. రేస్‌లో మొదటి స్థానంలో నిలిచాక సంబరంగా మైదానం అంతా తిరుగుతున్న బోల్ట్‌కు కెమెరామెన్ రూపంలో ప్రమాదం ఎదురైంది. చక్రాలతో ఉండే ‘సెగ్‌వే’పై బోల్ట్‌కు సమాంతరంగా అతడిని షూట్ చేస్తూ వస్తున్న కెమెరామెన్ అదుపు తప్పి పక్కనున్న రెయిలింగ్‌ను ఢీ కొన్నాడు.

తనను తాను నియంత్రించుకోలేక అతను ఒక్కసారిగా బోల్ట్‌ను ఢీకొన్నాడు. దాంతో పట్టు కోల్పోయిన బోల్ట్ బొక్కబోర్లా పడిపోయాడు. సెగ్‌వే నేరుగా బోల్ట్ మోకాలి కింది భాగంలోనే తాకింది. అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతుండగా ప్రమాదం లేదంటూ స్టార్ స్ప్రింటర్ చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు. ఆ ‘బంగారు కాళ్ల’ విలువ ఏమిటో ప్రపంచానికి తెలుసు. నిజంగా ఏదైనా పెద్ద గాయం తగిలి ఉంటే బోల్ట్ కెరీరే ముగిసేపోయేదేమో! పెద్ద ప్రమాదం తప్పిన అనంతరం ‘అతను నన్ను చంపాలని చూశాడు’ అంటూ బోల్ట్ సరదాగా వ్యాఖ్యానించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : usain Bolt  Bolt  Fall down  Clumsy Cameraman  Segway  IAAF World Championship  Beijing  

Other Articles