Mumbai Cricket Association (MCA) ended Shah Rukh Khan's five-year ban on entering the Wankhede Stadium

Mumbai cricket association ended shah rukh khan ban on entering wankhede stadium

shahrukh khan, wankhede stadium, shahrukh khan latest news, shahrukh khan updates, shahrukh khan controversy, wankhede stadium news, mumbai cricket association, mca on shahrukh khan

Mumbai Cricket Association ended Shah Rukh Khan ban on entering Wankhede Stadium : Mumbai Cricket Association (MCA) ended Bollywood superstar Shah Rukh Khan's five-year ban on entering the Wankhede Stadium, in a Managing Committee meeting on Sunday.

ఆ నిషేధం నుంచి షారుఖ్ కి విముక్తి

Posted: 08/03/2015 12:55 PM IST
Mumbai cricket association ended shah rukh khan ban on entering wankhede stadium

మూడేళ్ల నుంచి తనపై విధించిన నిషేధంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న షారుఖ్ కి ఎట్టకేలకు విముక్తి లభించింది. నిజానికి అది ఐదేళ్లపాటు విధించిన నిషేధం అయినప్పటికీ.. సదరు అధికారులు కరుణించి అతనికి ఆ సమస్య నుంచి ఉపశమనం కలిగించారు. ఇంతకీ షారుఖ్ ఫై విధించిన ఆ నిషేధం ఏంటి? అని ఆలోచిస్తున్నారా..! అదేనండీ.. ఆమధ్య ఓ వ్యక్తితో షారుఖ్ దురుసుగా ప్రవర్తించాడని.. అతనికి వాంఖడే మైదానంలో ప్రవేశంలేదని నిషేధం విధించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేసినట్లు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధికారికంగా ప్రకటించింది.

2012 ఐపీఎల్‌ సందర్భంగా వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సహా ఆ జట్టు యజమాని షారుఖ్... స్టేడియం భద్రతా అధికారితో దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా ఆ సమయంలో షారుఖ్ చాలా కోపాద్రిక్తుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన ఎంసీఏ అతడిని స్టేడియంలోకి అనుమతించకుండా జీవితకాల నిషేధం విధించింది. ఆ నిషేధం విధించినప్పటి నుంచి షారుఖ్ ఆ స్టేడియంకి వెళ్లిలేకపోయాడు. తన జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లను వీక్షించడానికి కొన్ని సందర్భాల్లో నానాతంటాలు పడ్డాడు కూడా! అయితే.. ఇప్పుడు ఎటువంటి కష్టం లేకుండానే షారుఖ్ వాంఖడే స్టేడియంలోకి ప్రవేశించి, వచ్చే ఏడాదిలో జరగబోయే ఐపీఎల్ సిరీస్ ని హాయిగా వీక్షించవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahrukh khan  wankhede stadium  mumbai cricket assocation  

Other Articles