Pune’s Aboli Naravane become Maharashtra topper in UPSC exams

Maharashtra upsc topper was inspired by sachin tendulkar s life

Aboli Naravane, Vimlabai Garware Prashala, Shama Bhate, UPSC Civil Services Examination, inspiration, Master Blaster Sachin Tendulkar, Sachin's biography, sachin's three qualities, dedication, down-to-earth approach, giving the best, maharashtra upsc topper, upsc result, upsc result 2015, aboli naravane, upsc preliminary exams, mumbai news, maharashtra news, india news, nation news

A student of Vimlabai Garware Prashala, Aboli has completed her MA in Economics and is a trained Kathak dancer under the tutelage of her guru, Shama Bhate.

సచిన్ జీవితమే నా సివిల్స్ కు స్ఫూర్తి..

Posted: 07/06/2015 04:22 PM IST
Maharashtra upsc topper was inspired by sachin tendulkar s life

భారత్ క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన మెరుగైన ఆటతీరుతో యావత్ ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్ గా నిలిచాడు. అయితే తాను యువ క్రికెటర్లకు స్పూర్తిగా నిలిచి వారు రాణించేందుకు దోహదపడితే పర్వాలేదు. కానీ ఏకంగా యునియన్ పబ్లిక్ సర్విస్ కమీషన్ సివిల్ పర్విసెస్ పరీక్షలు రాసేవారికి కూడా స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాడంటే.. అతని లో ఏదో తెలయని విషయాలు వున్నాయన్నట్టే. అయితే ఆయనలోని సగ్ధుణాలను పక్కన బెడితే.. నిజంగా ఆయన ఇటీవల విడుదలైన యూపిఎస్సీ పరీక్షలలో మహారాష్ట్ర టాపర్ గా నిలిచిన పూణేకు చెందిన ఇబోలి నర్వాణేకు స్ఫర్తి ప్రదాతగా నిలిచాడు. ఇది స్వయంగా ఇబోలి చెప్పిన మాటలు.

మహారాష్ట్ర టాపర్ గా నిలవడంతో ఆమెను ఇంటర్వ్యూ చేసిన మీడియాతో ఆమె తన భావాలను పంచుకున్నారు. మూడవ పర్యాయం సివిల్స్ పరీక్షలు రాసిన ఇబోలి.. మహారాష్ట్ర టాపర్ గా నిలచిన క్రెడిట్ ను తన సోదరి నేహా కులకర్ణి సహా తన   కుటుంబసభ్యలకు ఇచ్చింది. అంతేకాదు.. తాను సచిన్ టెండుల్కర్ జీవిత చరిత్రను ఆరు సార్లు చదవానని, అతనికి తాను గోప్ప ఫ్యాన్ కావడంతోనే ఆయన జీవిత చరిత్రను చదివానని చెప్పింది. అంతేకాదు ఆయనలో ఉన్న మూడు లక్షణాలు తనను సివిల్స్ పరీక్షలకు, ప్రజలకు సేవ చేయాలన్న భావనను కలిగించాయని పేర్కొంది.

సచిన్ క్రికెట్ ఆటతో తనకున్న నిబద్దత ఒక లక్ష్యణం కాగా, ఎంత ఎత్తుకు ఎదిగినా.. తనను పొగిడిన వారినైనా, తన అభిమానులైనా, తన పట్ల అఇష్టత వ్యక్తం చేసేవారితోనూనా.. సచిన్ తక్కువగానే బావిస్తాడని, ఎదగడం ఎంత ముఖ్యమో.. ఒదడం కూడా అంతే ముఖ్యమని సచిన్ ద్వారా తెలుసుకున్నానని, ఇక మూడో లక్షణం తన వంతుగా దేశానికి శక్తి వంచన లేకుండా చేయడమన్న మూడు లక్షణాలు తనను సివిల్స్ దిశగా ప్రేరేపించాయని ఇబోలి తెలిపారు. సచిన్ లో అత్యుత్తమ ఆటతీరును మాత్రమే చూసే సాధరణ ప్రజానీకానికి, ఇబోలికి వున్న తేడా ఇక్కడ అర్థమవుతుంది. అందుకే అమె సివిల్స్ కు ఎంపికయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aboli Naravane  UPSC Civil Services Examination  inspiration  Sachin  

Other Articles