India thrashed 0-4 by Belgium in FIH World League Semifinals

Belgium bashing sends clueless india packing

India, Hockey, India vs Belgium, World Hockey League, Semis, India Thrashed by Hosts Belgium, Jasjit Singh Kular, Sansarpur, FIH World League, hockey world league, world league hockey, india hockey world league, india vs belgium, belgium vs india, ind vs belgium, hockey news, hockey, latest Hockey news

India lose 4-0 vs Belgium in the semifinal, face winner of Australia vs Great Britain in the 3rd-4th place playoff.

ఇండియా, పాక్ వరల్డ్ కప్ ఆశలు గల్లంతు..

Posted: 07/04/2015 04:12 PM IST
Belgium bashing sends clueless india packing

బెల్జియంలోని యాంట్వార్స్ లో జరుగుతున్న హాకీ మ్యాచ్ లో భారత్ బొక్కబోర్లా పడింది. అథిత్య జట్టు బెల్జియం స్ట్రయికర్లు దాడుల ముందు భారత్ తెల్లముఖం వేయడం మినహా ఏమీ చేయలేకపోయింది. భారత ఢిపెన్సు బెల్జియం స్ట్రయికర్లను ఎదుర్కోవడంతో విఫలం చెందారు. ఆ తరువాత కోలుకున్నా అప్పటికే ప్రత్యర్ధి జట్టు మ్యాచ్ ను ఎగురేసుకుపోయింది. దీంతో హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైన్సల్ లో భారత్ కు ఫైనల్ భెర్త్ దూరమైంది. బెల్టిజయం 4-0తో భారత్ పై నెగ్గింది. తుది పోరుకు అర్హత సాధించిం ఫైనల్స్ లోకి వెళ్లింది.

బెల్జియం స్ట్రయికర్ వాన్ అబెల్ ఫోరెంట్ అత్యుత్తమ ఆటతీరు ప్రేక్షకులను మంత్రముగ్దల్ని చేసింది. మ్యాచ్ ఆరంభంలోనే రెండో నిమిషంలో భారత్ డిఫెన్స్ ను చిత్తు చేసి గోల్ సాధించాడు. ఆ తరువాత 41 నిమిషయంలో, మూడవ గోల్ 53 వ నిమిషంలో చేసి భారత్ పై హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. కోస్సిన్స్ టాంగే 8వ నిమిషంలో సాధించిన గోల్ సహా మొత్తంగా బెల్జియం నాలుగు గోల్స్ సాధించి భారత్ ను కోలుకోలేని దెబ్బ తీసింది. బెల్జియం ఆటగాళ్లు మెరుపు వేగంతో అడటం.. వారిని ఎదుర్కోన్నే క్రమంలో భారత ఢిపెన్స్ నిష్చేష్టులై నిమ్మకుండంతో గెలుపు వారి సోంతమైంది. కాగా ఐదవ స్థానం కోసం జపాన్ తో భారత్ హాకీ జట్టు తలపడనుంది.

రియో ఒలింపిక్స్‌కు దూరమైన పాక్.. ఆశలు గల్లంతు..

పాకిస్థాన్‌ హాకీ జట్టుపై ఐర్లాండ్‌ విజయం సాధించింది. దీంతో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని భావించిన పాక్‌ ఆశలు గల్లంతు అయ్యాయి. పాకిస్థాన్‌ హాకీ చరిత్రలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోవడం ఇదే తొలిసారి. హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్స్‌లో ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఐర్లాండ్‌ 1-0 గోల్‌ తేడాతో సంచలనం విజయం సాధించింది. పాకిస్థాన్‌తో 11 వరుస పరాజయాల తరువాత ఐర్లాండ్‌ సాధించిన తొలివిజయం ఇది. కాగా, ఈ ఓటమితో పాకిస్థాన్‌ 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. గత ఏడాది జరిగిన ఆసియా గేమ్స్‌ ఫైనల్‌లో భారత్‌ చేతిలో ఓడిపోయిన తరువాత ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి పాక్‌కు ఇదే చివరి అవకాశం. ఈ అవకాశాన్ని పాక్‌ చేజార్చుకుంది.

మ్యాచ్‌ అనంతరం పాక్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ మాట్లాడుతూ ' పాక్‌ హాకికి ఇది దుర్ధినం' అని వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోవడం పాకిస్థాన్‌కు ఇదే తొలిసారి. ఒలింపిక్స్‌లో పాకిస్థాన్‌ హాకీ జట్టుకు విజయవంతమైన జట్టుగా పేరుఉంది. ఒలింపిక్స్‌లో మూడు సార్లు స్వర్ణ పతకాలను పాక్‌ కైవసం చేసుకుంది. ఈ అంశంలో పాక్‌ మూడో స్థానంలో ఉంది. భారత్‌ హాకీ జట్టు 8 సార్లు ఒలింపిక్స్‌ స్వర్ణ పతకాలు గెలుచుకుంది. జర్మనీ నాలుగు స్వర్ణ పతకాలు సాధించింది. కాగా, గత ఏడాది ప్రపంచకప్‌కు పాకిస్థాన్‌ అర్హత సాధించ లేకపోయింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  belgium  pakistan  ireland  World Hockey League  

Other Articles