Include Jwala Gutta, Ponnappa in TOP scheme: KCR to PM

Kcr comes in rescue for jwala

Top, Target olympics podium, KCR, PM modi, indian badminton, canada open, jwala gutta, ashwini ponnappa, indian badminton, canada open, jwala gutta badminton, jwala gutta-aswini ponnappa, ashwini ponnappa, canada open, canada open final, sports news, sports

Jwala Gutta, the badminton player who is currently ranked 13th in the world, has ... Gutta and her doubles partner Ponnappa have not been included in the TOP.

జ్వాలను టాప్ లో చేర్చాలంటూ ప్రధానికి లేఖ

Posted: 07/04/2015 02:01 PM IST
Kcr comes in rescue for jwala

హైదరాబాదీ బ్యాట్మింటన్ స్టార్ గుత్తా జ్వాలాను టాప్ లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి సిఫార్సు లేఖ అందింది. కేంద్ర ప్రభుత్వ పధకమైన టార్గెట్ ఒలింపిక్ పొడియం (టాప్)లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలను చేర్చాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు లేఖ రాశారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావును గుత్తాజ్వాల కలిసారు. తనను టాప్‌లో ఎంపిక చేయలేదని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ ఈ విషయంలో ప్రధాన మంత్రికి లేఖ రాయనున్నట్టు హామీ ఇచ్చారు.

గుత్తా జ్వాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్టు హామీ ఇచ్చారు. అలాగే జ్వాలకు శిక్షణ కోసం కోచ్‌ను ఏర్పాటు చేస్తామని, ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒలింపిక్ వంటి అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు అవసరమయ్యే శిక్షణ ఇప్పించడానికి, అలాగే సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గుత్తా జ్వాలతో పాటు ముఖ్యమంత్రిని స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ దినకర్‌బాబు కూడా కలిశారు. మొత్తానికి కెనెడా ఓపెన్ గ్రాండ్ స్లామ్ వుమెన్ డబుల్స్ టైటిల్ దక్కించుకున్న జ్వాలకు ఇక కాలం కూడా కలసి వస్తున్నట్లు వుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jwala gutta  Top  Target olympics podium  KCR  PM modi  indian badminton  canada open  

Other Articles